Teluguwonders:
జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు అంటున్నారు గిరిబాబు.
🔴గిరిబాబు:
5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు తెలుగు సినీ ప్రముఖుడు అయిన గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో రామారావు,బాలకృష్ణ లతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు…ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకున్నారు . ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో పార్టీలో చేరి పని చేశారు.
👉ఎన్టీ రామారావు గురించి గిరిబాబు మాట్లాడుతూ…:
ఎన్టీ రామారావు గారు చాలా సిన్సియర్, డెడికేటెడ్ మ్యాన్. ఆయన సాధించని విజయం లేదు, అన్నీ సాధించారని చెప్పుకొచ్చారు. రియల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉండేవారు. సెట్లో ఆయన యాక్ట్ చేస్తున్నపుడు ఏం గిరి.. నేను చేసింది బావుందా? అని అడిగేవారు, అలా అడగటం ఎంత గొప్పవిషయం.
🔴ఆ ఇద్దరినీ బీట్ చేసేవారు లేరు:
పౌరాణికాల్లో ఒక నారదుడు తప్ప ఎన్టీ రామారావు అన్ని పాత్రలు వేశారు. జానపదాల్లో చాలా పాత్రలు వేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు. వారిని చూసే మాలాంటివారమంతా సినిమాల్లోకి వచ్చాం.వంద సంవత్సరాలైనా వారి ఇమేజ్ బీట్ చేసేవారు రారు, రాలేరు.
🔴ఎన్టీఆర్ చివరి దశలో:
మరో ప్రశ్నకు గిరిబాబు సమాధానం ఇస్తూ…. ఎన్టీఆర్ చివరి దశలో మేము ఏం చెయ్యడానికి లేదు. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది, అది మరిచిపోవడానికి మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలం కాదు. రాజకీయ పరిణామం వాళ్ల బంధువర్గంలోనే జరిగిపోయింది. అంత వెలుగు వెలిగిన మహానుభావుడు చివరకు అంత దారుణమైన స్థితికి పడిపోవడం అనేది శోచనీయమైన విషయం.అది కర్మ… దురదృష్టం.
🔴బాలకృష్ణ అలాంటి వాడు:
బాలయ్యకు బాగా కోపం, అందరినీ సెట్లో కొడుతుంటారు అనేది నిజం కాదు. ఎవరినైనా ఇరిటేట్ చేస్తే కోపం రావడం సహజం. ఇరిటేట్ చేస్తే నాకు మాత్రం కోపం రాదా? అలాగే బాలకృష్ణకు వస్తుంది. బాలకృష్ణ నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటాడు. ఆయనతో చాలా సినిమాలు తీశాను. .
మేము చాలా సార్లు కలిసి ఉండేవారం. ఎప్పుడైనా ఫారిన్ షూటింగుకు వెళితే మంచి మంచి సిగరెట్లు కాల్చేవారం. సపరేటుగా షాపింగుకు వెళ్లి నాకు అవి పంపించేవారు. బ్రదర్ ఎలా ఉంది అని ఫోన్ చేసేవారు. మా మధ్య అంత సాన్నిహిత్యం ఉండేది.
💥రామారావు తర్వాత తారక్ :
రామారావు ఉన్నపుడు తెలుగు దేశం పార్టీలో పని చేశాను.కానీ ఇపుడు వైసీపీలో ఉన్నాను . తెలుగు దేశం పార్టీ బ్రతికి బట్టకట్టడం అనేది ఇప్పట్లో కష్టం. ఆ పార్టీ మళ్లీ బ్రతికి బట్టకట్టాలంటే ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే జూనియర్ ఎన్టీఆర్… ఈ విషయం నేను గతంలోనే చెప్పాను. ఆయన్ను పార్టీలోకి రానీయకుంటే జనం వారిని బయటకు పంపుతారు…. అంటూ గిరిబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్,వైఎస్ఆర్, ఇద్దరూ గ్రేట్ పీపుల్ అని ఆయన అన్నారు.
👉2009లోనే:
రాజశేఖర్ రెడ్డి వైపు వచ్చాను. ఇపుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నాను. ప్రజల కష్టాలు జగన్ తెలుసుకున్నాడు, అవి పోగొడతాడనే నమ్మకంతో గెలిపించారు.
💥మరో 10 నుంచి 15 సంవత్సరాలు జగనే:
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మనకు కనిపిస్తున్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు… ఓడిపోయామనే ఉక్రోశం పట్టలేక జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. తర్వాత 5 ఏళ్లు కూడా వారు అధికారంలోకి రాలేరు. మరో 10 నుంచి 15 సంవత్సరాలు జగనే సీఎం అన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.