Latest

    కమిషన్.. భగీరథ !

    Lakshman blames Telangana government : Mission Bhagiratha

    Teluguwonders:

    కేసీఆర్ పాలనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విరుచుకుపడ్డారు . టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ..అంటూనే గడీల పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని బయట పడేయాలి అని ఆయన అంటున్నారు .

    💥 బీజేపీ భరతమాత ముద్దు బిడ్డల పార్టీ :

    టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ.. కాంగ్రెస్ తల్లీకొడుకులు పార్టీ.. బీజేపీ మాత్రం భరతమాత ముద్దు బిడ్డల పార్టీ అంటూనే
    తెలంగాణ ఏ విషయంలో నెంబర్ వన్ చెప్పాలంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. ఎందులో నెంబర్ వన్ అప్పుల్లో, అవినీతిలోనా అంటూ ప్రశ్నించారు. 👉హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో మాట్లాడిన లక్ష్మణ్.. టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు.

    తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్‌ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. టీఆర్ఎస్‌తో లాలూచీ పడుతోందన్నారు. నిధులు, నీళ్లు నియామకాలతో కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు నలుగురి పాలయ్యిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ పాట రూపంలో పల్లెపల్లెలో ఉద్యమానికి కదం తొక్కతున్నారన్నారు.

    🔴అప్పుల కుప్పగా తెలంగాణ :

    సొంత రాష్ట్రం వస్తే నిధులు పుష్కలంగా సమకూర్చుకుంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.

    ఉమ్మడి రాష్ట్రంలో 16మంది ముఖ్యమంత్రులు 60వేల కోట్ల అప్పులు చేస్తే.. కేసీఆర్ ఈ ఐదున్నరేళ్లలో లక్ష పైచిలకు కోట్లు అప్పులు చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో చేపట్టి ప్రాజెక్టులు కూడా ఒక్క కుటంబానికి దోహదపడుతున్నాయని.. కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ కమీషన్ల కోసం కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయ అంటూ చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఊసు లేదని.. అన్ని ప్రాజెక్టుల్ని మూలన పడేశారని మండిపడ్డారు.

    కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులు పక్కన పెట్టేసి.. సీమకు పోయి.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చెబుతున్నారని.. అమ్మకు అన్నం పెట్టని కేసీఆర్.. పిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతామంటున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మణ్.

    🔴మిషన్ భగీరథ కాదది కమిషన్ భగీరథ :

    రతనాల రాయలసీమ గురించి దేవుడెరుగు.. సాగు, తాగునీరు కావాలని తెలంగాణలో జనాలు అల్లాడిపోతున్నారన్నారు. కేసీఆర్ మాత్రం.. సాగు నీరు కాదు తాగు నీరు కాదు.. ఊరురా బారిస్తా, బీరిస్తా.. తాగండి తన్నుకొని చావండని మద్యాన్ని ప్రవహింప చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బార్లు వస్తున్నాయి.. బడులు మూతపడుతున్నాయి ఇది కేసీఆర్ నిర్వాకం అన్నారు.
    మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటిని ఇవ్వందే ఓట్లు అడగనని చెప్పారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికలకు పోయిన కేసీఆర్.. తర్వాత పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఇప్పుడు ఊళ్లలో నీళ్ల కోసం కొట్లాడుతున్నారని.. బిందెల్లో నీళ్లు ఏమో కానీ.. గ్రామాల్లో బీర్లు మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయన్నారు. ఆ మిషన్ భగీరథతో కాంట్రాక్టుల జేబులు నింపడం తప్పే ప్రజలకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. ఇక గ్రామాలకు చిల్లిగవ్వ ఇవ్వలేదని.. కొత్త సర్పంచ్‌లు వచ్చి నాలుగు నెలలు దాటిపోయిందన్నారు. ఇగు కేంద్ర పథకాలను కూడా సరిగా అమలు చేయడం లేదని.. ఆరోగ్య శ్రీను గాలికి వదిలేశారని విమర్శించారు.
    కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఆగిపోయాయని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని లక్ష్మణ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ మాత్రం లక్షల కోట్లు ఉంటోందన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాట మార్చారని.. కేసీఆర్, కేటీఆర్ ఊసరవెల్లి సిగ్గు పడేలా రంగులు మార్చారన్నారు. లక్షకుపైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారని.. ఈ కల్వకుంట్ల పాలనను సాగనంపాలన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదామన్నారు లక్ష్మణ్. రాబోయే రోజుల్లో గడీల పాలనను అంతం చేద్దాం.. బంగారు తెలంగాణ ను స్థాపిద్దాం..అది బీజేపీతోనే సాధ్యమన్నారుపాలనను గాలికి వదిలేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారంటూ మండిపడ్డారు. 👉ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ సెక్రటేరియెట్‌కు రారని.. అలాంటి సీఎంకు కొత్త సెక్రటేరియెట్ ఎందుకని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు అందరూ కలిసి రావాలన్నారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading