Teluguwonders:
పెన్షన్ల అందజేతలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ మరోసారి ట్వీట్లు చేశారు. 8 రోజులు గడిచినా ఈ అవస్థలేంటని నిలదీశారు…సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
🔴 ఫించన్లు కూడా పెంచలేదు :
వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చిన జగన్.. గెలిచిన తర్వాత రూ.250 మాత్రమే పెంచారని కూడా లోకేశ్ గతంలో జగన్ సర్కారును విమర్శించారు. అర్హులకు పెన్షన్ రావాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ. 50 వేయాలని ఆయన ఆరోపించారు.
🔴పెన్షన్ల విడుదలలో జాప్యం విషయమై :
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి టార్గెట్ చేశారు. సకాలంలో పెన్షన్లు అందించడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘జగన్ గారూ.. ప్రమాణ స్వీకారం రోజున పింఛన్ల గురించి అట్టహాసంగా చెప్పుకున్నారు. మరుసటి నెల మీ తండ్రిగారి పుట్టినరోజు వరకు పింఛన్లు ఇవ్వకుండా పేదలను తిప్పించుకుని, మళ్ళీ మీ గొప్పలను ప్రచారం చేసుకున్నారు. ఇంత ప్రచారం చేసుకుంటే ఇక నుంచైనా ఒకటో తారీఖున పింఛన్లు ఇస్తారని అనుకున్నాం. ఎనిమిది రోజులైనా ఈ అవస్థలేంటి సీఎం గారు?’’ అని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. పెన్షన్లు ఇవ్వాలని వృద్ధులు ఆందోళన చేస్తున్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. పెన్షన్ల పథకానికి తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టారు. అందుకే గత నెలలో ఆయన జయంతి రోజున పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రమాణ స్వీకారం రోజున పింఛన్ల గురించి అట్టహాసంగా చెప్పుకున్నారు. మరుసటి నెల మీ తండ్రిగారి పుట్టినరోజు వరకు పింఛన్లు ఇవ్వకుండా పేదలను తిప్పించుకుని, మళ్ళీ మీ గొప్పలను ప్రచారం చేసుకున్నారు.
ఇంత ప్రచారం చేసుకుంటే ఇక నుంచైనా ఒకటో తారీఖున పింఛన్లు ఇస్తారని అనుకున్నాం. ఎనిమిది రోజులైనా ఈ అవస్థలేంటి సీఎం గారు?
సమయానికి పెన్షన్లు ఇవ్వకుండా అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నారని గతంలోనూ లోకేశ్ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో పెన్షన్లు అందుతున్న తీరు సరిగా లేదని ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన అందే పెన్షన్లు.. జగన్ సీఎం అయ్యాక సమయానికి అందడం లేదన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.