Teluguwonders:
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని సాధినేని కలవడంతో ఆమె బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. లక్ష్మీనారాయణతో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యామిని సాధినేని పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం తో..కొద్ది రోజుల క్రితమే చంద్రబాబును కలిసిన యామిని పార్టీ మార్పుపై స్పందించారు.
💥కీలక వ్యాఖ్యలు చేసిన యామిని సాధినేని :
గత రెండు మూడు నెలలుగా మీడియా ముందు కనిపించని ఆమె తాజాగా తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని పార్టీ మారడంపై స్పందించారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన యామిని.. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. పార్టీ మారే ఉద్దేశం ఉంటే తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చిన చెబుతానంటున్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి.. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే అభిప్రాయాన్ని యామిని వ్యక్తం చేశారు.
🔴వ్యక్తిగత కారణాల వల్ల :
పార్టీకి, కార్యక్రమాలకు తన వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉన్నానని.. తన తండ్రి కొద్దిరోజుల క్రితమే చనిపోయారన్నారు. రెండు వారాల క్రితమే చంద్రబాబు తనను పిలిపించి మాట్లాడారని.. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చారు.
కొత్త ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కొన్ని మంచివి ఉన్నాయనే భావన ఉందని.. మరికొన్ని నిర్ణయాలపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఆ నిర్ణయాలపై ఓసారి అధ్యయనం చేసి.. త్వరలోనే మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానంటున్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోందని.. ఈ ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను.. ఉంటాను అన్నారు. ప్రస్తుతానికి పార్టీ మారే ఉద్దేశం తనకు లేదన్నారు యామిని. పార్టీ మారే ఉద్దేశం ఉంటే మీడియా ముందుకు వచ్చి ప్రజలకు చెబుతానన్నారు.
సాధినేని యామిని పార్టీ మారబోతున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసినట్లు ఫోటో కూడా వైరలయ్యింది. దీంతో ఆమె బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం మొదలయ్యింది. త్వరలోనే ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే టాక్ నడిచింది. ఈ ప్రచారం పై యామిని స్పందించారు..ఇక పై కూడా టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.