Teluguwonders:
🔴ఈ అనిల్ ఎవరో :
తాజాగా కోడెల తనయుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపుతోంది. వైఎస్సార్సీపీ వేధింపుల వల్లే కోడెల మరణించారని, సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే కోడెల కొడుకు శివరాంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని అనిల్ బూరగడ్డ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అనిల్ ఎవరో తెలియాల్సి ఉంది.
కోడెల కేసులో సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే కోడెల మరణానికి దారితీసిన పరిణామాలన్నీ బయటకు వస్తాయన్నారు. సంఘటన జరిగిన రోజు పరిణామాలు, కోడెల కుమార్తె ఫిర్యాదు అన్నింటిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించానని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.
💥వివరాల్లోకి వెళ్తే :
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెలది ఆత్మహత్య కాదు. ముమ్మాటికీ అది హత్యే. ఆయన కుమారుడు కోడెల శివరాం హత్య చేసి ఉంటాడని అనుమానాలున్నాయి. సీబీఐ విచారణకు ఆదేశించాలని టీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
💥కోడెలను కొడుకే చంపాడు! హైకోర్టులో పిటిషన్ :
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన మరణంపై అనుమానాలున్నాయని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని, ఆయన తనయుడు శివరామే హత్య చేశాడన్నఅనుమానాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
🔴కోడెల బావమరిది కంచేటి సాయి ఫిర్యాదు :
ఇదిలా ఉంటే కోడెల శివప్రసాదరావును ఆయన కొడుకే హత్య చేశాడని, లేదంటే చేయించి ఉంటాడని కోడెల బావమరిది కంచేటి సాయి ఇప్పటికే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆస్తులన్నీ తన పేరిట రాయాలని కొడుకు శివరాం బెదిరిస్తున్నాడని, కొడుకు నుంచి ప్రాణహాని ఉందని కోడెల స్వయంగా తనతో చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయి పోన్ నంబర్లతో సహా ఫిర్యాదు చేయడం, కోడెల ఫోన్ మిస్ కావడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.