Teluguwonders:
మొన్న ఎలక్షన్స్ ఫలితాలలో దారుణం గా ఓడిపోవడం tdp కి పెద్ద దెబ్బ అనుకుంటే ఇప్పుడు ఆ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది .అదేంటంటే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు.
🔴ముందస్తు సమాచారం : ఈ రోజు ఉదయమే ఆ నలుగురు తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి నలుగురు రాజ్యసభ ఎంపీలు ఊహించని షాక్ ఇస్తున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ సాయంత్రం కల్లా అధికారిక ప్రకటన వెలువడనుందని బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు, కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో చర్చలు కూడా జరిపారు. తమ నలుగురిని ప్రత్యేక టీమ్‌గా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ ఇచ్చారు. గురవారం మధ్యాహ్నం ఈ వ్యవహారంపై సస్పెన్షన్ నెలకొన్నప్పటికీ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చేసింది.
🔴ఆ నలుగురు :
గతం లో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్‌రావు
టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండే వారు. ఇప్పుడు ఆ నలుగురు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యకు రాజీనామా లేఖలు అందజేశారు.
🔴ఇక ఇద్దరు ఎంపీలే :
ఇదిలా ఉంటే.. ఈ నలుగురు సభ్యులు టీడీపీని వీడితే రాజ్యసభలో ఆ పార్టీకి ఇక మిగిలింది ఇద్దరు ఎంపీలే. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను అమిత్ షా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు.. అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
🔴టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు :
పార్టీ మారిన ఎంపీల మీద టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. వారంతా చచ్చు దద్దమ్మలు అంటూ మండిపడ్డారు. అధికారం ఉంటే అనుభవించడానికి పనికొస్తారు తప్ప.. వారంతా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయలేని దద్దమ్మలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. . వారిని ప్రజల్లో తిరగనివ్వబోమని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.
🔴వారంతా కేసులకు భయపడి :
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ..
ఆర్థిక సమస్యలు, సీబీఐ, ఈడీ కేసులకు భయపడి వారు బీజేపీలోకి వెళ్లినట్టు తెలుస్తోందని అన్నారు. గతంలో శరద్ యాదవ్ విషయంలో రాజ్యసభ చైర్మన్ ఎలా వేటు వేసరో ఇప్పుడు కూడా అలాగే వారిపై వేటు వేయాలని పిలుపునిచ్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.