Teluguwonders:
💥ఎంపీ సుప్రియా సూలేతో ట్యాక్సీ డ్రైవర్ అనుచిత ప్రవర్తన:
మహిళా ఎంపీని ట్యాక్సీ డ్రైవర్ వేధించిన ఘటన ముంబై రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో ఓ ట్యాక్సీ డ్రైవర్ రైలు బోగిలోకి వచ్చి అనుచితంగా ప్రవర్తించాడు.అయితే నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తనకు తెలిపారని ఎంపీ వివరించారు. వేగంగా స్పందించిన పోలీసులకు మహిళా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్క రైలు ప్రయాణికుడికీ ఇలాంటి అనుభవం ఎదురు కావొద్దని కోరారు.
🌟ఎంపీ సుప్రియా సూలే ఆవేదన :
ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి తనకు షాకింగ్ అనుభవం ఎదురైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. రైలు బోగిలోకి వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. తనను అడ్డగించడమే కాకుండా తాను వారిస్తున్నా వినకుండా తన ఫోటోలు తీశాడని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం (సెప్టెంబర్ 12) ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని.. రైల్వే స్టేషన్లలో ఏ మహిళకూ ఇలాంటి అనుభవం ఎదురు కావొద్దని ఆమె కోరారు.
🔴వివరాల్లోకి వెళ్తే :
‘నేను రైల్వే బోగీలో ఉండగా.. ఓ ట్యాక్సీ డ్రైవర్ వచ్చి ట్యాక్సీ కావాలా? అని అడిగాడు. వద్దని చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ అదే ప్రశ్న వేస్తూ వేధించాడు. రెండుసార్లు నిరాకరించిన తర్వాత నన్ను అడ్డుకొని సిగ్గులేకుండా ఫోటోలు తీసుకున్నాడు’ అని ఎంపీ సుప్రీయా ట్వీట్ చేశారు.
🔴అధికారులను ప్రశ్నించిన సుప్రీయా:
తనను అడ్డగించిన ట్యాక్సీ డ్రైవర్ పేరు కుల్జీత్ సింగ్ మల్హోత్రా అని ఎంపీ సుప్రియా తెలిపారు. ట్యాక్సీ కోసం ప్రయాణికులను వేధించడానికి రైల్వే స్టేషన్లలో అనుమతి ఉందా అని అధికారులను ఉద్దేశించి ఎంపీ ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే, దాన్ని ట్యాక్సీ స్టాండ్ వరకే పరిమితం చేయాలని.. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఇలాంటివి జరగకుండా చూడాలని సూచించారు. ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని ఎంపీ సుప్రియా సూలే తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.