Teluguwonders:
ఏపీలో చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా రాజధాని అమరావతి అంటూ ఓ రేంజ్‌లో హంగామా చేసినా ఇక్కడ స్వంత ఇళ్లు, పార్టీ కార్యాలయం మాత్రం నిర్మించుకోలేదు. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ గవర్నమెంటు ఆఫీసులకే కాదు, తన పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించుకున్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసింది. చంద్రబాబు మాత్రం హడావిడితోనే సరిపెట్టేశారు. తాను ఏపీ నుంచే పాలన చేస్తున్నానని జనాలను నమ్మించినా ఆయన హైదరాబాద్‌లో బ్రహ్మాండంగా ఇళ్లు నిర్మించుకున్నారు.
ఏపీలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా సరైన పార్టీ ఆఫీస్ కూడా లేదు. అధికారం నుంచి దిగిపోయాక తెలుగుదేశం పార్టీ ఆఫీసును కడుతున్నారు. అమరావతిలో నిర్మితమవుతున్న ఏపీ ఆఫీసు హైదరాబాదు పార్టీ ఆఫీసు కంటే పెద్దది.
2 లక్షల చదరపు అడుగుల స్థలంలో కడుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఈ భవనం త్వరలో పూర్తి కానుంది. ప్రస్తుతానికి తెలంగాణలోని హైదరాబాద్లో టీడీపీకి ఆఫీస్ ఉన్నా అక్కడ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు.
త్వరలోనే హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్‌ను అద్దెకు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీకి సంబంధించి భవిష్యత్తులో కార్యకలాపాలు అన్ని అమరావతి నుంచే సాగనున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెద్ద విస్తీర్ణంలో కడుతున్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరిలో ప్రారంభిస్తారు.
మంగళగిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ కార్యాలయం హైదరాబాదులోని కేంద్రం కార్యాలయం కంటే 5 రెట్లు పెద్దది. పార్కింగ్ కోసం అత్యధిక స్థలాన్ని వదిలిపెట్టారు. మూడు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ 3 డీ నమూనాను కూడా చంద్రబాబు రిలీజ్ చేశారు. ఏదేమైనా ఇప్పటకీ అయినా ఏపీలో పార్టీ ఆపీస్ లేకపోయినా… ఇక్కడ ఉండి ఏపీ పాలన చేయకుండా హైదరాబాద్ టు అమరావతి టూర్లు వేసినా రిజల్ట్ ఎలా ఉంటుందో ? బాబుకు తాజా ఎన్నికల ఫలితాలు తెలిసొచ్చేలా చేశాయి. అందుకే బాబు ఇప్పటికిప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టేస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.