ట్రంప్ కేసీఆర్ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?

Spread the love

Trump appreciates KCR

[the_ad id=”4846″]

 

అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన నిన్నటితో ముగిసింది.. ట్రంప్ అమెరికా బయలు దేరేముందు అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు దేశంలోని ప్రముఖులను కూడా ఆహ్వానించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఈ విందు కోసం ఆహ్వానం అందింది. మంగళవారం రాత్రి విందులో పాల్గొనడానికి మధ్యాహ్నం కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.

[the_ad id=”4846″]

ట్రంప్ తో విందుకు ముందు పరిచయ కార్యక్రమంలో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి పరిచయం చేశారు. ట్రంప్ రాగానే కేసీఆర్ తొలుత చేతులు జోడించి నమస్కారం చేశారు. ప్రతిగా చేయి చాచిన ట్రంప్ తో కరచాలనం చేశారు.  పురోభివృద్ధి రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ ను పరిచయం చేశారట..

ఇదే సందర్భంలో ట్రంప్ తో కేసీఆర్ మాట కలిపారు. ‘గతంలో హైదరాబాద్ లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో మీ కుమార్తె ఇవాంక ట్రంప్ హాజరయ్యారని.. అది మా హైదరాబాద్ అని గుర్తు చేశారట..’.. కేసీఆర్ మాటలకు ట్రంప్ చిరునవ్వు నవ్వుతూ ‘అవును.. నాకు తెలుసు’ అని చెప్పినట్టు గా తెలిసింది.

[the_ad id=”4846″]

ఇక ట్రంప్ భార్య కోసం కేసీఆర్ సిద్ధం చేసిన చీర గిఫ్ట్ ను ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ట్రంప్ విందుకు ఎవరూ ఏ గిఫ్ట్ లు తీసుకు రావద్దని సూచనలు రావడం తో కేసీఆర్ విరమించుకున్నట్టు తెలిసింది.

[the_ad id=”4846″]

USA President Donald Trump appreciated the way Global Business Summit has been conducted in Hyderabad. Trump complimented KCR and shook hands with him at Rashtrapathi Bhavan.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading