Teluguwonders:
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియరైంది. సభ్యుల సంఖ్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తరువాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
💥టీటీడీ పాలకవర్గ సభ్యుల సంఖ్యలో ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది . గతంలో చైర్మన్ సహా 15 మంది సభ్యులుగా ఉండేవారు. ఆ సంఖ్యను ప్రభుత్వం 25 కి పెంచనుందన్న వార్తలు వచ్చాయి. ఆ తరువాత తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లను కూడా సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం యోచించింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో టీటీడీ పాలకవర్గంలో 29 మంది సభ్యులుగా ఉండనున్నారు. చైర్మన్ సహా 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 29 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు న్యాయశాఖ ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది అని ఎదురుచూశారు.
💥ఆర్డినెన్స్ ఫైలుకు గవర్నర్ ఆమోదముద్ర:
సభ్యుల సంఖ్య పెంపునకు ప్రతిపాదించిన ఆర్డినెన్స్ ఫైలుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఆమోదముద్ర వేశారు. టీటీడీకి జంబో ట్రస్టుబోర్డు నియామకం కానుంది. బోర్డులో ఒకేసారి పదిమంది సభ్యులను ప్రభుత్వం పెంచింది. దీంతో సాధారణంగా నియమితులయ్యే సభ్యుల సంఖ్య 15నుంచి 25కు పెరిగింది. వీరుకాకుండా మరో నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 29మందితో భారీ ట్రస్టుబోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే చైర్మన్ ఉన్నందున మిగిలిన 24మంది నియామకంపై నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. కాగా, టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యులను ప్రభుత్వం శుక్రవారం నియమించి, ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వీరందరు శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసి వెంటనే తొలి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
మొదట పాలకవర్గ సభ్యుల సంఖ్య 32కి చేరుతుందని భావించారు. 👉కానీ 29 మంది సభ్యులు అయినా జంబో క్రిందే లెక్క.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.