*బఫెట్‌ను మించిన ముకేశ్*
*ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానం* *తొమ్మిదో స్థానానికి పెట్టుబడుల మాంత్రికుడు*
రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ మరోసారి చరిత్ర సృష్టించారు. సంపద విషయంలో పెట్టుబడుల మాంత్రికుడు వారెన్ బఫెట్‌ను అధిగమించారు.
◆ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గురువారం రోజున ముకేశ్ సంపద 68.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.5.12 లక్షల కోట్లు)గా నమోదైంది.
◆ గురువారం నాటి బఫెట్ సంపద 67.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది ఎక్కువ. మార్చిలో కనిష్ఠాలకు చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రెట్టింపునకు పైగా లాభాలను పొందాయి. రిలయన్స్ జియోలోకి ఫేస్బుక్, సిల్వల్ లేక్ వంటి కంపెనీలు 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడం ఇందుకు కారణం. ప్రపంచంలోనే అగ్రగామి 10 కుబేరుల జాబితాలో ఉన్న ఏకైక ఆసియా దిగ్గజం ముకేశ్ అంబానీ కావడం విశేషం.
◆ కాగా, గత వారం బఫెట్ 2.9 బిలియన్ డాలర్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించడంతో ఆయన సంపద తగ్గింది. 2006 నుంచీ ఇప్పటి దాకా 37 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్లను ఆయన వితరణ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో ఈ కంపెనీ షేర్ల పనితీరు కూడా డీలా పడింది. తాజా సూచీ ప్రకారం.. అంబానీ(63) ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానంలోకి; బఫెట్ తొమ్మిదో స్థానంలోకి చేరారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది జరిగిన విలీనాలు-కొనుగోళ్ల(ఎం అండ్ ఏ)లో అంబానీ ఒప్పందాల వాటా 12 శాతం కావడం గమనార్హం. 1998 నుంచి ఇదే అత్యధిక నిష్పత్తి అవడం విశేషం.
◆ కాగా, జెఫ్ బెజోస్ 188 బి. డాలర్లతో అగ్రస్థానంలో నిలవగా.. బిల్‌గేట్స్(115 బి. డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్(92.8 బి. డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్(92.7 బి. డాలర్లు)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.