
వృద్ధాప్య పింఛన్ ఇక 60 ఏళ్లకే, వికలాంగులకూ శుభవార్తచెప్పిన జగన్
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా నవరత్నాలు అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ఇక వృద్ధాప్య పెన్షన్లు 60 ఏళ్లకే అందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు వయోపరిమితి 65 ఏళ్లు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వయోపరిమితిని 60 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ల పెంపుపై మొదటి సంతకం చేసిన ఆయన.. వైఎ్‌సఆర్ పెన్షన్ కానుక పేరుతో అమలు చేయనున్న సామాజిక పెన్షన్లకు…