సాయి ధరంతేజ్ పై కుట్ర జరుగుతుందా???

Spread the love

🔅సాయి ధరమ్ తేజ్ 🔅 పేరు తెలియని మెగా అభిమాని ఉండడు .”రేయ్” సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ  ఇచ్చిన సాయి ధరంతేజ్ మొదటి చూపులోనే  పున్నమి నాగులో ,తన మేనమామ అయినచిరంజీవి లా కనిపించడం విశేషం. నిజానికి సాయి ధరమ్ తేజ్ మొదట నటించిన సినిమా “రేయ్” అయినా2సినిమా అయిన ” పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో నే అందర్నీ ఆకట్టుకున్నాడు. డాన్స్ ఫైట్స్ విషయంలో మెగా అభిమానుల్ని ఆనందపరిచాడు .తర్వాత నటించిన “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” సినిమా లో కూడా తన నటన లోని ఈజ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. సినిమాలోని “గువ్వా.. గోరింకతో..” అనే సాంగ్ లో అచ్చం చిరంజీవిల డాన్స్ చేసి అభిమానులను మరింత ఆనందపరిచారు. తిరిగి తెరపై “యంగ్ మెగాస్టార్ “ని చూసినట్టుగా అభిమానులు ఎంతో పులకించి పోయారు.తర్వాత వచ్చిన సుప్రీం కూడా మాస్ ప్రేక్షకులకు మంచి కిక్కెక్కించింది. మాస్ హీరోగా తనకి ఒక ప్లేస్ ని ఏర్పరిచింది .మళ్లీ సినిమాలో కూడా “అందం హిందోళమ్”అనే  చిరంజీవి సాంగ్ తో  తిరిగి అభిమానులను మరింత ఆనందపరిచి “సుప్రీమ్ హీరో “సాయి ధరమ్ తేజ్ అని పేరు సంపాదించుకున్నాడు .అప్పుడు చూసిన వారందరు సాయి ధరంతేజ్ మెగా హీరోలలో నెంబర్ వన్ హీరో అవుతారని గట్టిగా  అనుకున్నారు డిసైడ్ అయిపోయారు..కానీ కథ అక్కడే అడ్డం తిరిగింది కారణం ఏమో తెలియదు కానీ సాయి ధరమ్ తేజ్ తర్వాత వరుసగా వచ్చిన “విన్నర్”, “తేజ్ లవ్ యు..”  సినిమాల ద్వారా  ఫ్లాపులు ఇచ్చుకుంటూ వచ్చాడు .తర్వాత వినాయక దర్శకత్వంలో నటించిన “ఇంటెలిజెంట్” సినిమా కూడా నిరాశపరిచింది .ఒకప్పుడు “మురారి “తో మహేష్ బాబు ని నిలబెట్టిన కృష్ణవంశీ కూడా తనని  పైకి లేపలేక పోయాడు. తన నటన బాగున్నా ఒక్కోసారి సినిమా కథ బాగున్నా కూడా సినిమా ఆకట్టుకోలేకపోయేది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవ్వలేదు కానీ  సాయి ధరంతేజ్ కెరియర్ పై  పెద్ద కుట్ర జరుగుతుందని మాత్రం ప్రచారం మొదలైంది.తన కుటుంబ సభ్యులైన ఒక అగ్ర నిర్మాత తన కొడుకు  కెరియర్ కి అడ్డం వస్తున్నాడని కుట్ర చేస్తున్నారని ప్రచారం జరిగింది. తనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించిన ఒక కుర్ర హీరోయిన్ తో రొమాన్స్ కూడా తన కెరియర్  పాడవడానికి కారణం అని టాక్ వచ్చింది. ఇందులో ఎంత నిజం ఉన్నా లేకపోయినా వరుసగా వచ్చిన ఫ్లాపులతో తన కెరియర్ బాగా డౌన్ అయింది. తన కొడుకు కెరియర్ పాడవడం చూసిన సాయిధరమ్తేజ్ తల్లి డైరెక్ట్ గా మెగా స్టార్ వద్దకు వెళ్లి తన బాధను వెల్లడించుకుందని,అది విని కరిగిపోయిన మెగాస్టార్ సాయి ధరమ్ తేజ్ నటించబోయే తర్వాతి కథను స్వయంగా విని మార్పు చేర్పులు చేసి ఓకే చేశాడని అన్నారు. కథతో చేసిన సినిమానే “చిత్రలహరి”, చిత్రంగా మంచి హిట్ సాధించింది, అంటే దీని అర్థం మెగా సపోర్టు వర్క్ ఔట్ అయినట్టే కదా మెగా సపోర్ట్ ఉన్నంతకాలం మెగా హీరోకి ఇక తిరుగు ఉండదు..💐👍 Its a Mega fact..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *