
నన్ను ఇలా చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. ఆ నటుడి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.
ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మానందం. వందల సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించారు. బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు తెలియకుండానే నవ్వు వస్తుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు బ్రహ్మానందం. ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి….