ఈ శ్రీమంతుడు..తన ఊరిని మార్చేశాడు

Spread the love

స్వార్థం ఇప్పుడు ఇది ప్రతి మనిషి రక్తం లోనూ అణువణువున నిండిపోయింది. పక్కవాడికి సహాయం చేయడం తర్వాత పక్క వాడి ది కూడా దోచేసుకుని దాచేసు కుందామనుకుంటున్నారు కొంత మంది .కోటీశ్వరులు మరింత కోటీశ్వరులౌతున్నారు..పేద వారు మరింత పేద వారుగా మారుతున్నారు. వారి తలరాత ని ఎవరూ మార్చలేరు.అది అసాధ్యం

కానీ దక్షిణ చైనా లో దాన్ని సుసాధ్యం చేసాడు ఒక మనసున్న మహరాజు.మధ్యతరగతి, పేదవారి తలరాత మార్చడానికి ఓ ధనవంతుడు ముందడుగు వేశాడు. అతడే 56 ఏళ్ల ‘షియాంగ్  షుయ్హువా’, పేదరికంలో పుట్టినా అదృష్టం,కష్టం కలిసొచ్చి సంపన్నులుగా మారినవారు  చాలామందే ఉంటారు. అయితే, తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవారిని గుర్తు పెట్టుకునేవారూ పుట్టిన ఊరికి ఏదో ఒకటి  చేయాలనుకునేవారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వ్యక్తే షియాంగ్. ఆ ఊరిలోనే  పుట్టి, భవన నిర్మాణ వ్యాపారం, ఉక్కు పరిశ్రమల ద్వారా సంపన్నుడైన అతడు తిరిగి ఊరికోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు. చిన్నతనంలో షియాంగ్ కుటుంబం చాలాపేదరికంలో ఉండి కడుపు నింపుకోవడానికి  కూడా ఎంతో కష్టపడే  సమయంలో అండగా నిలబడిన గ్రామస్థులు కు ఆ తరవాత ఏదైనా చేద్దాం అనుకున్నాడు .

ఆ తర్వాత ఉండడానికి సరైన ఇళ్లు కూడా లేక బతుకీడుస్తున్న వారి వైనాన్ని చూసి  తట్టుకోలేక వెంటనే అందరికీ ఇళ్లు కట్టిస్తానని చెప్పి వారి పాత ఇళ్లను పడగొట్టించి ఆ స్థానంలో 72 కుటం బాలకు అత్యాధునిక సౌకర్యాలతో ప్లాట్లు కట్టించాడు. ఇవికాక తమ కుటుంబానికి ఎక్కువ సన్నిహితంగా ఉన్న మరో 18 కుటుంబాలకు విడివిడిగా విలాసవంతమైన విల్లాల్ని నిర్మించాడు. ఇళ్లతోపాటు, గ్రామంలో అన్నివైపులా సిమెంట్ రోడ్లూ, కమ్యూనిటీ హాల్, ఈతకొలను పార్కు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆటస్థలం… ఇలా సర్వహంగుల్నీ అక్కడ ఏర్పాటు చేశాడు. ఇంత చేసినా, ఇదంతా ఎందుకు అని అడిగిన వారికి ఆయన చెప్పే సమాదానం ఒకటే ‘నాకససరమైనదాని కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించాను

అదంతా ఏం చేసుకోవాలి..అందుకే … నా జీవితం ఎక్కడ మొదలైందో గుర్తుచేసే నా ఊరికీ, మేం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదు కున్న ప్రజలకూ తిరిగివ్వాలనుకున్నా” అంటాడు షియాంగ్.   ఇవేకాదు, షియాంగ్ ఈ గ్రామంలోని వృద్ధులకూ పేదలకూ రోజూ మూడు పూట్లాఉచితంగా భోజనం కూడా పెడుతున్నాడు.శ్రీమంతులెందరో ఉండొచ్చు. కానీ ఇలాంటి

కోటికొక్క మనసున్న శ్రీమంతుడు ఒక్కడే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *