లోక్ సభ ఎలక్షన్స్ ఫలితాలు ఇంకా రాకుండానే కొన్ని వర్గాలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి. పవన్ పని అయిపోయిందని ఈ ఎలక్షన్స్ లో తనకు డిపాజిట్ కూడా రాదని ఆ వర్గాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నాయి .తన అన్న లాగే పవన్ కళ్యాణ్ కూడా తిరిగి సినిమాల్లోకి చేరిపోతాడని దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను, వారి మనసులను బలహీనపరచడానికి అని తెలుస్తున్నది .ఇదంతా జరుగుతుందని ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ గత సంవత్సరం డిసెంబర్ లోనే ఒక ప్రకటన విడుదల చేశారు .తాను ప్రజా క్షేత్రం లో ఉండి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని అని చెప్పిన పవన్ కల్యాన్..
తన పూర్తి సమయం ప్రజా జీవితానికే అంకితం అని..తాను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజంకాదని చెప్పారు.తాను ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదని అసలు సినిమాలో నటించేందుకుఅవసరమైన సమయం తన వద్ద లేదని అన్నారు. తన పూర్తి సమయం ప్రజల్లోనేఉంటూ, నసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తానని అన్నారు .తాను సినిమాలపై దృష్టి సారించడం లేదని తన ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే అని తన తపన అంతా సమసమాజ స్థాపన కోసమే అని ఆ ప్రకటనలో తెలిపారు..తమ హీరో గురించి అభిమానులకు,ప్రజలకు కూడా అర్థమయ్యింది.ఇక ప్రచారాలు చేసే వారు కూడా అర్థం చేసుకోవడం మంచిది..