ఒక హీరోయిన్ ని పెళ్లాడతానన్న.. మరో హీరోయిన్…
ఈ మధ్యన జనాల మద్య రిలేషన్స్ ఏ రకంగా ఉంటున్నాయో కూడా అర్థం అవ్వటం లేదు. మొన్నామధ్య కాజల్ గొడవ సోషల్ మీడియా లో ఇంకా చల్లారక ముందే మరొక సౌత్ హీరోయిన్ తన ప్రవర్తన తో సోషల్ మీడియా కి కాక పెంచుతుంది..విషయంలో కి వస్తే {మే 4}ఈ రోజు, చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నటి త్రిష పుట్టిన రోజు .ఆ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్త్ డ్ విషెస్ చెబుతున్నారు. ఆమెతో కలిసి ‘పౌర్ణమి’ మూవీలో నటించిన చార్మీ కూడా త్రిషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. త్రిష తనను ముద్దాడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన చార్మి.. బేబీ ఐ లవ్ యూ టుడే అండ్ ఫరెవర్ అని ట్వీట్ చేసింది. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నా ప్రపోజల్‌ను ఎప్పుడు అంగీకరిస్తావా అని నేను మోకాళ్ల మీద నిలబడి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు చట్టపరంగా ఇది సమ్మతమే అని సరదాగా ట్వీట్ చేసింది.
గతంలోనూ చార్మీ ఇలాగే త్రిషతో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చింది. అప్పట్లో త్రిష కూడా చార్మీ ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. ఈసారి మాత్రం ఇంకా స్పందించలేదు. OK చెప్తే చార్మీ ఒకవేళ నిజంగానే పెళ్లి చేసుకుంటుందేమో…