వేపాకు బ్యూటీ పార్లర్..

Spread the love

అందానికి వేప:
రుచికి చేదు అయినా వేప ఆకుతో చర్మ, కేశ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.

  • పనీకర్ల మొటిమలూ మచ్చలూ బ్లాక్ హెడ్స్ ని నివారిస్తాయి. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించి దింపేయాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. ప్రతీరోజూ ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఫలితంగా కొన్నాళ్లకు మొటిమలూ, వాటితాలూకు మచ్చలూ పోతాయి.
  • పొడిచర్మం ఉన్నవారికి వేపపొడి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. వేపఆకుల
    పొడిలో కాసిని నీళ్లల్లా, కొద్దిగా ద్రాక్ష గింజల నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే చర్మం తాజాదనంతో మెరుస్తుంది. అలాగే వయసురీత్యా వచ్చే ముడతల్ని నివారించేందుకు ముఖానికి వేపనూనె రాసుకుని మర్దన చేసుకోవాలి.
  • చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు… వేపఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి, షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అలాగే వేప ఆకుల పొడిని నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసి మాడుకు పట్టించి అరగంట తరవాత షాంపూతో కడిగేసినా ఫలితం ఉంటుంది.
  • కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతోంటే.. వేపాకుల పొడిని కొంచెం
    నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని కళ్ల చుట్టూ రాసుకుని పది హేను
    నిమిషాల తర్వాత కడిగేయాలి.ఇక చూడండి..మీ వేప చెట్టు వైపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *