భోజనం చేసాక ఈ పనులు..అస్సలు చెయ్యకూడదు..

Spread the love

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందుకు భోజనం చేశాక కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు.
👉భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు.అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది.
👉అన్నం తిన్న వెంటనే టీ..కాఫీలు తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు , ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
👉తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
👉భోజనం అయ్యాక పదినిమిషాలు పాటు నడిస్తే మంచిది అంటారు.కానీ అలా నడవటం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా, ఓ పదినిమిషాల తర్వాత నడిస్తే చాలు.
👉అన్నింటికంటే ముఖ్యంగా తినగానే నిద్ర పోకూడదు. అలా నిద్రపోతే తిన్నఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇవి పాటించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *