సైరా అగ్ని ప్రమాద సంఘటన లో..అసలు నిజం ఏంటి..???

Spread the love

ఇన్సూరెన్స్ కోసం రాంచరణ్ కక్కుర్తి పడ్డాడా..?
సైరా నర్సింహారెడ్డి చిత్రం సుమారు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్నది. అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. భారీ ఎత్తున వేసిన సెట్ మంటల్లో కాలి బూడిద కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెట్‌లో అగ్ని ప్రమాదం గురించి మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వివాదం గురించి వివరాల్లోకి వెళితే..
సైరా చివరి షెడ్యూల్ కోసం భారీగా ఏర్పాటు చేసిన కోటకు సంబంధించిన సెట్‌ను గండిపేటకు సమీపంలోని కోకాపేటలోని మెగాస్టార్ ఫాంహౌస్‌లో నిర్మించారు. కొద్దిరోజులపాటు సెట్‌లో షూటింగ్ కూడా జరుగింది. అయితే మే 3వ తేదీ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్నది. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకొనే సరికే సెట్ పూర్తిగా మంటల్లో బూడిదైనట్టు సమాచారం.
👉సైరా సెట్‌ అగ్నిప్రమాదానికి గురి కావడంపై నిర్మాత, హీరో రాంచరణ్ అప్పుడు స్పందించారు కూడా. “సెట్‌లో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరుగలేదు. సెట్‌ను పునరుద్దరించి చివరి షెడ్యూల్‌ను పూర్తి చేస్తాం” అని రాంచరణ్ అప్పుడు ట్వీట్ చేశారు . ప్రాథమికంగా రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందనే అంచనాకు వచ్చారు.

👉కొందరి సందేహాలు :
సైరా సెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సెట్‌ను తగలపెట్టారు. ఇన్సూరెన్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలను పొందడానికి సెట్‌ ని అగ్ని ప్రమాదం కు గురి చేసారు అని కొందరు సందే హిస్తున్నారు.

👉మరి కొందరి వాదన :
భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించేటప్పడు స్క్రిప్టు డిమాండ్ మేరకు సెట్ల నిర్మాణం జరుగుతుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత వాటిని ఏదో రకంగా ప్రమాదం జరిగిందని ఇన్సూరెన్స్‌ను పొందుతారు. కానీ సైరా సెట్ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఎందుకంటే ఇంకా అక్కడ షూటింగ్ ఉంది. దాని కోసం మళ్లీ సెట్‌ను పునరుద్దరిస్తున్నారు అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం రాంచరణ్ లాంటి నిర్మాత కక్కుర్తి పడుతారా ,పడరు.. అనే వాదనను ఓ వర్గం వినిపిస్తున్నది.ఆ వాదనే నిజం అని చాలా మంది అనుకుంటున్నారు కూడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *