ఇండియాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచిందా..??

Spread the love

ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ చేసిన ఒక ప్ర‌క‌ట‌న ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్తిస్తోంది. అంత‌ర్జాతీయంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

🔴‘విలయ ఆఫ్ హింద్’ : ఇండియాలో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామని ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రావిన్స్​కు ‘విలయ ఆఫ్ హింద్’గా పేరు పెట్టినట్లు వెల్లడించింది. కాశ్మీర్‌‌లో శుక్రవారం జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఈ ప్రకటన చేసింది. ఈ ప్ర‌క‌ట‌న దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్తిస్తోంది.షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి భారీగా ప్రాణనష్టం మిగిల్చినట్లు ఐసిస్‌‌ కు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 🔴ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రతిస్పందన : ఐసిస్ ప్రకటనపై ఎస్ఐ‌‌టీఈ (సెర్చ్ ఫర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఎంటిటీస్) ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ స్పందిస్తూ, కాశ్మీర్​లో ఐసిస్ ఉనికే లేదని, అలాంటప్పుడు ఇక్కడ ఓ ప్రావిన్స్‌‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని అన్నారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా వదిలేయడానికీ లేదని చెప్పారు. కానీ ఇండియాలో నిజంగానే ఉగ్రవాదులు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచి ఉంటే..జరిగబోయే పరిణామాలు..ఎంత భయంకరంగా ఉంటాయో తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *