పోలింగ్ అనేది ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజల అభిప్రాయం ,అది గోప్యంగానే ఉంచుతారు, ఉంచాలి .ఆ గోప్యత కోసం పోలింగ్ రోజు అక్కడి యంత్రాంగం చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కానీ ఆ ప్రాంతంలో యంత్రాంగం ఏమైందో ఏమో రెండు బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చాయి.
విషయంలోకి వెళితే 😳సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్ పత్రాలు : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ ఎంపీటీసీ స్థానం పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు చెందిన రెండు బ్యాలెట్ పత్రాలు (జడ్పీటీసీ, ఎంపీటీసీ) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను మొబైల్‌లో ఫొటో తీసి పోస్టు చేశారు. దీంతో ఈ బ్యాలెట్ పత్రాలు వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొట్టాయి.
👉ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి వివరణ : ఫొటోల విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. బ్యాలెట్ పత్రాల క్రమసంఖ్య ఆధారంగా నిందితులను గుర్తిస్తామని.. అనంతరం విచారించి తదుపరి చర్యలు చేపడతామని అన్నారు.కానీ రహస్యంగా ఉంచాల్సిన ఇలాంటి విషయాలు కూడా రక్షణ లేకపోవడం మన ప్రజాస్వామ్యానికి,రాజ్యాంగానికి ఎదురుదెబ్బే..