చిరంజీవి విద్యా సంస్థ మొదలు పెట్టబోతున్నారు ,…రాయితీలు మాత్రం కేవలం అభిమానులకు మాత్రమే…
చిరంజీవి వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు అనగానే ఏమిటా వ్యాపారం అని ఆలోచిస్తున్నారా…ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు విద్య వ్యాపారమే కదా…ఆల్రెడీ మోహన్ బాబు శ్రీ విద్యా నికేతన్ స్థాపించి దూసుకుపోతున్నారు. ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా stepping stones పేరుతో స్కూల్ ని నడుపుతున్నాడు . ఇప్పుడు చిరంజీవి వంతు. విషయంలో కి వెళ్తే.. 👉 శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో చిరంజీవి తనస్కూల్ మొదలు పెట్టబోతున్నారు. 🔸ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉంటారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అత్యంత అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నామని సీఈవో జె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేందుకు ప్రప్రథమంగా అక్కడ మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు అని కూడా ఆయన తెలిపారు. 👉తరగతులు ఈ విద్యా సంవత్సరం నుండే మొదలు : జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
👉విధ్యార్డులకు ప్రత్యేకసౌకర్యాలు ; ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ .
🔸ప్రత్యేకతలు : పేరెంట్-టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు.
👉విధానం :
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్తమాన పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాంకేతిక అంశాలతో పాటు తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలలో శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్ లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఎస్టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు.