ఇలా…చేసి ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ని మార్చుకోండి ….

Spread the love

భారతదేశంలో అందరికీ ఉపయోగపడే ఐడెంటిటీ కార్డ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ కార్డుతో ఉపయోగాలెన్నో. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోవడమే కాదు… ప్రభుత్వం అందించే పథకాలు పొందేందుకు కూడా ఈ కార్డు ముఖ్యమైపోయింది. ఇప్పటి వరకు 66 కోట్ల మంది మాత్రమే తమ మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో అప్‌డేట్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే కొత్త నెంబర్ తీసుకున్న తర్వాత… ఆధార్ కార్డులో కూడా ఆ నెంబర్ అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులొస్తాయి. ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఆన్‌లైన్ సర్వీసుల్ని ఆధార్ ఓటీపీ ద్వారా పొందొచ్చు. మరి మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.
🔸విధానం :
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చడానికి తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ అప్‌డేషన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ పాత ఫోన్ నెంబర్‌తో పాటు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఫామ్ ఇచ్చిన తర్వాత మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్‌తో అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయిన తర్వాత ఓటీపీలన్నీ కొత్త నెంబర్‌కే వస్తాయి. 👉Checking : మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయిందో లేదో UIDAI వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. uidai.gov.in ఓపెన్ చేసి ‘Aadhaar Services’ కేటగిరీలో ‘Verify Email/Mobile Number’ పైన క్లిక్ చేయాలి. పర్సనల్ డీటైల్స్ సెక్షన్‌లో మీ పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ‘Get OTP’ క్లిక్ చేస్తే కొత్త నెంబర్‌కు ఓటీపీ వచ్చినట్టైతే మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయినట్టే. అదండీ ప్రోసెస్…ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఆన్‌లైన్ సర్వీసుల్ని ఆధార్ ఓటీపీ ద్వారా పొందొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *