కొంత మంది తల్లి తండ్రులు , గురువులు ఈ పోస్ట్ ని తప్పక చదవండి…

Spread the love

ఈ మధ్యన చాలామంది విద్యార్థులు మార్కులు తక్కువగా వచ్చాయనో లేదా రాబోయే, రాయబోయే పరీక్షలో మార్కులు తక్కువగా వస్తాయనో లేదా తక్కువ మార్కులు వస్తే తమ తల్లిదండ్రులు ఏమంటారో అని భయపడో బలవంత మరణానికి పాల్పడుతున్నారు . దీనికంతటికీ కారణం పిల్లలను కేవలం చదువుకునే యంత్రాల్లా చూసే కొంత మంది తల్లిదండ్రులు మరియు గురువులు అని అర్థమవుతుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారందరికీ ఢిల్లీ కి చెందిన ఒక గృహిణి తెలుసుకోవాల్సిన పాఠం లా కనిపిస్తుంది . ఇలా ఎందుకు అంటున్నామో ఆవిడ రాసిన లేఖను చూస్తే అర్థమవుతుంది . విషయంలోకి వెళ్తే 👉ఢిల్లీ కి చెందిన వందన సుఫియా అనే ఒక గృహిణి గారు తన కొడుకు మార్కుల గురించి సామాజిక మాధ్యమంలో పోస్టును పెట్టి నేటి తరం పిల్లల తల్లితండ్రులందరికి ఆదర్శంగా నిలిచారు.ఇంతకూ తన కుమారుడికి వచ్చిన మార్కులు..నూటికి అరవై శాతం.ఇంతోటి దానికి పోస్టులు పెట్టాలా అని ఆశర్యపోకండి.ఆ పోస్ట్ సారాంశం చదివాకా మీ ఆలోచనా విధానం ఎలా వుందో ఒక్కసారి ఆలోచించండి.

👉ఆవిడ పోస్టులో ఇలా రాసింది : “ప్రియమైన ఆమీర్ ముందుగా నువ్వు పదవ తరగతిలో ఆరవై శాతం ఉతీర్ణత సాధించినందుకు శుభాకాంక్షలు. అవును నిజమే నీకు వచ్చింది అరవై శాతమే తొంబై శాతము కాదు, నీకు అరవై శాతం వచ్చినా తొంబై శాతం వచ్చినా నేను పడే ఆనందంలోనూ నేను నీపై చూపించే వాత్సల్యం లోను ఎటువంటి తేడా ఉండదు.నువ్వు కొన్ని సబ్జెక్టులతో ఇబ్బంది పడ్డావు పరీక్ష చివరి నెలలో ఆ ఇబ్బందులను అధిగమించాడనికి నువ్వు చాల కృషి చేశావు. చివరకు ఆ కృషి ఫలితంగా నువ్వు గెలిచావు. నాన్నా ఆమీర్ ఇప్పటి సమాజం ఈత కొట్టే చేప పిల్లలను చెట్లెక్కి పర్వతాలు ఆధిరోహించమంటుంది. నువ్వు మాత్రం నీకు సాధ్యపడే సాధనంతోనే సముద్రాలను ఈదు. నువ్వు ఎప్పటికి ఇలాగె బుద్దిగా ఉండాలని,రోజురోజుకు నీ మేధస్సు పెరగాలని. ముఖ్యంగా మీ అమ్మ దగ్గర వేసే కోతి చేష్టలు మానొద్దని ఆశీర్వదిస్తున్నాను ” అని పోస్టును పెట్టింది.ఇది చదివాక కొంత మంది తల్లితండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించే విధంగా మారతారని..కోరుకుందాం.ఈ విధంగా గృహిణి వందన సుఫియా గారు
చాలా మంది తల్లితండ్రులకు ఆదర్శంగా నిలిచింది… పిల్లలంటే ఈ నేల మీద వెలుగులు నింపే నక్షత్రాలే కానీ…కేవలం అక్షరాలను మాత్రమే నెమరు వేసే యంత్రాలు కాదు..అని తెలియచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *