మనకున్న నంబర్స్ లో ఒక్కో నంబర్ కి ఒక్కో విశిష్టత వుంటుంది. 9 అంకె కయితే మరీను. శాస్త్రం లొ తొమ్మిది అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య , వృద్ది సంఖ్య , పురాణ సంఖ్యగా పేర్కొంటారు. 👉♦9 అంకె విశిష్టత ; ఎంత చిన్న లేదా పెద్ద సంఖ్యనైనా తొమ్మిది తో హెచ్చవెసి శేషాల మొత్తన్ని కలిపితే తొమ్మిదే వస్తుంది . 👉మనకి ఉన్న 4 యుగాల లో ♦కృతయుగం – 17, 28, 000 సంవత్సరాలు ♦త్రేతాయుగం -12, 96, 000 సంవత్సరాలు. ♦ద్వాపరయుగం – 8 ,64, 000 సంవత్సరాలు….. ♦కలి యుగం – 4,32,000సంవత్సరాలుఈ యుగాల సంవత్సరాల మొత్తం ను కలిపినా చివరికి తొమ్మిదే వస్తుంది. ఇది తొమ్మిది అంకెకి
మాత్రమే ఉన్న ప్రత్యేకత. 👉అలాగే హిందువుల అరాధ్య గ్రంథ మైన మహాభారతం కూడా తొమ్మిది సంఖ్యతో ముడి పడి వుంది . భారతంలోని పర్వాలు 18, మహా భారత యుద్ధం జరిగిన రోజులు 18 , అకౌషహిణులు 18, భగవద్గీత అధ్యాయాలు 18, …. వీటిని ఏకసంఖ్యగా మారిస్తే తొమ్మిదే వస్తుంది. అంతే కాదు తొమ్మిదిని “మృత్యుంజయ సంఖ్య “గా భావిస్తారు. ♦ముఖ్యం గా బిడ్డ తల్లి గర్భంలో ఉండేది నవమాసాలు.అంటే 270 రోజులు… దీన్ని ఏక సంఖ్య గా మారిస్తే మళ్లి తొమ్మిదే వస్తుంది. ♦అలాగే మనిషి కిఉన్న ప్రాణ రంధ్రాలు కూడా తొమ్మిదే సృస్టిలొని వెన్నె ముక గల ప్రతి ప్రాణికి నవరంధ్రలు ఉంటాయి. ఇదండీ 9 అంకె యెక్క విశిష్టత.