దీపిక్ అనే డాన్ తన విషయం అందరికీ తెలియాలని tiktok లో ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ tiktok వీడియో విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని టక్ టక్ మని కటకటాల్లోకి గెంటేసారు.
👉♦tiktok app: సోషల్ మీడియాలో ‘టిక్ టాక్’ యాప్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా పాటలు, డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా అన్నింటినీ ఈ యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు.
👉🔴ఈ app పై విమర్శలు : ఇటీవల ఈ యాప్ ద్వారా అశ్లీలత ఎక్కువగా ఉందని, చిన్నారులు చెడిపోతారని, వెంటనే దీన్ని నిషేధించాలని అనేక డిమాండ్లు వెల్లువెత్తాయి. 👉దీనిపై విచారణ చేసిన హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. తాజాగా ఈ యాప్ ద్వారా ఓ వీడియోను తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
👉♦వివరాల్లోకి వెళ్తే : మహారాష్ట్రలోని పూణె పరిధిలోని పంపరీ చింద్వాడాకు చెందిన దీపక్ ఆబా అనే 23ఏళ్ల యువకుడు ఓ మరాఠీ పాటకు అనుగుణంగా విన్యాసాలు చేశాడు. తానొక డాన్ నని తెలుపుతూ ఓ వీడియో రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది బెడిసికొట్టడంతో పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేశారు. దీపక్ స్థానికంగా ఉంటూ.. డబ్బుల కోసం అందర్ని బెదిరిస్తుండటాని పోలీసుల విచారణలో తేలింది. గతంలో అతనిపై అనేక కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక విధంగాపాపులర్ అవుతాననుకున్న tiktok app వల్లే de-పాపులర్ అయిపోయాడు..పాపం..