ఔను ఆ దేవి అనుమతి లేకుండా..చిన్న చీమయినా కుట్టదు. ఆ దేవత పేరే అనుమతీదేవి.!!! మరి 👉అనుమతీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే
ఏమిచేయాలి..?
అనుమతీదేవి : శివారాధనలో తప్పకుండా ఆమెప్రస్తావనవచ్చితీరుతుంది. ఏదైనా ఒక కార్యంతలపెట్టడానికి దైవికమైన అనుమతి లేకుండా ఏదీజరగదు. ‘శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు’అంటారు పెద్దలు. ఆ శివునిఆజ్ఞలను తెలిపేదే అనుమతీదేవి. 👉పౌర్ణమి ముందు రోజుని అనుమతి అంటారు. శివుడు, ఆయనకు ఆశ్రీతుడైన చంద్రుడు మన
మనస్సును నడిపించే దేవతలు. పౌర్ణమి ముందు రోజు అంటే నెలలోని పధ్నాలుగవ రోజు శివారాధన చేస్తే అనుమతీదేవి అనుగ్రహించి సకల సంపదలనూ,సంతానాన్నీ, అద్వితీయమైన మేధస్సునూ ప్రసాదిస్తుంది. ఆమె కృష్ణ జింక వాహనంగా కలిగి
ఉంటుంది. అర్ధమయ్యింది గా అనుమతి దేవి అనుమతి లేకుండా ఏ చిన్న పనీ జరుగదు..!!!