ఫలితాలు ఇంకా రాకముందే జగన్ కేబినెట్లో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై సోషల్ మీడియా లో ఊహాగానాలు జోరు అందుకున్నాయి. మరో ఏడు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. వైసీపీకి 110కి పైగా సీట్లు వస్తాయని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఐతే వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 26 మందికి జగన్ చోటుకల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేతల సీనియారిటీ, సామాజికవర్గాలు, ప్రాంతాలను బేరీజు వేసుకొని పక్కాగా లిస్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది.ఐతే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ జాబితాను వైసీపీ వర్గాలు ధృవీకరించడం లేదు. ఫలితాలు రాకముందే మంత్రి పదవులపై మాట్లాడుకోవడం అంతగా బాగోదని చెబుతున్నారు.అసలు
🔥ప్రచారంలో ఉన్న జగన్ కేబినెట్ వివరాలు ఇవి.
♦ముఖ్యమంత్రి : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
👉స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
👉డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
👉రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు
👉హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
👉రోడ్లు & భవనాలు : బొత్స సత్యనారాయణ
👉భారీ నీటి పారుదల : కొడాలి నాని
👉మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
👉స్త్రీ శిశు సంక్షేమం : తానేటి వనితా
👉పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
👉వైద్యఆరోగ్యశాఖ : అవంతి శ్రీనివాస్
👉విద్యాశాఖ : కురసాల కన్నబాబు
👉బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
👉అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
👉న్యాయ శాఖ : వై. విశ్వేశర రెడ్డి
👉దేవాదాయ : కోన రఘుపతి
👉పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి
👉ఐటీ : మోపిదేవి వెంకటరమణ
👉విద్యుత్ శాఖ : ఆర్. కే. రోజా
👉మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
👉సినిమాటోగ్రఫీ : గ్రంధి శ్రీనివాస్
👉కార్మిక, రవాణా : ఆళ్ళ నాని
👉సాంఘిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి
👉వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
👉మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్
👉టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్
👉గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి
👉పరిశ్రమలు : కాకాని గోవర్ధన్ రెడ్డి
జగన్ కేబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, రోజా, అవంతి శ్రీనివాస్‌కు కీలక మంత్రిపదవులు అప్పచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.