‘ఏబీసీడీ’ .. స‌రిగ్గా రాయ‌లేదు

Spread the love

చిత్రం: ఏబీసీడీ

ట్యాగ్‌లైన్‌: అమెరిక‌న్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశీ

👉న‌టీన‌టులు: అల్లు శిరీష్‌, రుక్స‌ర్ థిల్లాన్‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు త‌దితరులు

♦స‌మ‌ర్ప‌ణ‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు

👉సంస్థ‌: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌

♦ద‌ర్శ‌క‌త్వం: సంజీవ్‌ రెడ్డి

♦నిర్మాత‌లు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని

♦సంగీతం: జుదా సాందీ

♦సినిమాటోగ్ర‌ఫీ: రామ్‌

♦ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

నిర్మాత‌కు త‌న‌యుడై ఉండీ, త‌న‌దైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అల్లు శిరీష్‌. ఒక వైపు త‌మిళ్‌, మ‌రోసారి మ‌ల‌యాళం, తెలుగులోనూ వైవిద్య‌మైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌తో ముందుకు సాగుతున్నాడు. ఆయ‌న గ‌త చిత్రం `ఒక్క క్ష‌ణం` పెద్ద‌గా ఆడ‌లేదు. ఇప్పుడు ఏబీసీడీ విడుద‌ల‌య్యింది. ఈ సినిమా మ‌ల‌యాళ చిత్రం ఆధారంగా తెర‌కెక్కింది. ఇంత‌కీ ఈ సినిమా ఈ వేస‌విలో ప్ర‌జ‌ల‌ను అల‌రించిందా? ఏబీసీడీ అంటూ ఈ అమెరిక‌న్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశీ ఏం చెప్తుతున్నాడు..? జ‌స్ట్ వాచ్‌

👉క‌థ‌:

అర‌వింద ప్ర‌సాద్‌(అల్లు శిరీష్‌) అమెరికాలో పుట్టి పెరిగిన ఇండియ‌న్‌. తండ్రి మిలియ‌నీర్ కావ‌డంతో ఖ‌ర్చు విష‌యంలో అర‌వింద్ ముందు, వెనుకా ఆలోచించ‌కుండా ఖ‌ర్చు పెడుతుంటాడు. అయితే అర‌వింద్ తండ్రి (నాగ‌బాబు) మాత్రం కొడుక్కి డ‌బ్బు విలువ తెలియ‌జెప్పాల‌ని చాలా సార్లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతాడు. చివ‌ర‌కు ఆయ‌నొక ఆలోచ‌న చేస్తాడు. కొడుకు అర‌వింద్‌ని, అత‌ని స్నేహితుడు బాల షణ్ముగం అలియాస్ భాషా(భ‌ర‌త్‌)ని ఇండియా టూర్‌కి వెళ్ల‌మంటాడు. ఇండియా వ‌చ్చిన అర‌వింద్ అలియాస్ అవి ఖ‌ర్చుల‌కు తండ్రి డ‌బ్బులు కేవ‌లం ఐదు వేల రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తాడు. ఉన్న దాంట్లో పొదుపుగా రోజుకి రూ.83 మాత్ర‌మే ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. ఈలోపు తండ్రి అవిని, భాషాని ఎంబీఏ కాలేజ్‌లో జాయిన్ చేయిస్తాడు. అక్క‌డ అవికి నేహ‌(రుక్స‌ర్ థిల్లాన్‌) ప‌రిచ‌యం అవుతుంది. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరుగుతుంది. అయితే ఓ సంద‌ర్భంలో అవి రోజుకి 83 రూపాయ‌లు మాత్ర‌మే ఖర్చు పెడుతున్నాడ‌నే విష‌యం మీడియాకి తెలిసిపోయి పాపుల‌ర్ అయిపోతాడు. మ‌రో వైపు మినిష్ట‌ర్‌(శుభ‌లేక సుధాక‌ర్‌), తన కొడుకు భార్గ‌వ్‌(రాజా)ని రాజ‌కీయ వార‌సుడిని చేయాల‌నుకుంటాడు. అందుకోసం ప్ర‌జ‌ల్లో ఉండ‌మ‌ని స‌ల‌హా ఇస్తాడు. నేతాజీ న‌గ‌ర్ వాసులు కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీని మూసి వేయాల‌ని చాలా ఏళ్లుగా ప్ర‌భుత్వానికి మొర పెట్టుకుంటూ ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. భార్గ‌వ్ కూడా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోడు. ఓ కార‌ణంగా అవి, భార్గ‌వ్ కంటే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంటాడు. త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అవిని భార్గ‌వ్ ఎలా వాడుకోవాల‌నుకుంటాడు? అవి ఏం చేస్తాడు? చివ‌ర‌కు అవికి డ‌బ్బు విలువ తెలుస్తుందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

👉విశ్లేష‌ణ‌:

చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తోన్న అల్లు శిరీష్ మ‌ల‌యాళ చిత్రం ‘ఏబీసీడీ’ని ఆధారంగా చేసుకుని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. అల్లు శిరీష్ ఈ సినిమాను ప్ర‌త్యేకంగా ఎందుకు ఎంచుకున్నాడ‌నేది అర్థం కాలేదు. న‌టుడిగా త‌న పాత్ర‌కు న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక రుక్స‌ర్ థిల్లాన్ పాత్రకు పెద్ద‌గా స్కోప్ లేదు. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఏదో ఉందంటే ఉంద‌నేలానే ఉంది. ఇక తండ్రి పాత్ర‌లో నాగ‌బాబు ఒదిగిపోయాడు. ఇక మెయిన్ విల‌న్‌గా న‌టించిన రాజా పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించాడు.

👉Comedy not bad : హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా న‌టించిన భ‌ర‌త్ పాత్రానుగుణంగా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.. కానీ న‌వ్వించ‌లేక‌పోయాడు. సినిమాలో కామెడీ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించిందే కానీ.. ఎంట‌ర్‌టైనింగ్‌గా లేదు. వెన్నెల కిషోర్ పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంత‌లో త‌ను బాగానే న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.

♦Remake reverse అయ్యింది : ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాతృక‌లో పెద్ద హిట్ అయిన సినిమాను తెలుగు నెటివిటీకి అనుగుణంగా రీమేక్ చేయ‌లేక‌పోయాడు. సినిమాలో ఆర్టిఫీషియాలిటీ చాలా సన్నివేశాల్లో ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. జుదా సాందీ సంగీతం ప‌రావాలేదు. “మెల్ల‌మెల్ల‌గా”సాంగ్ బావుంది. నిర్మాణభారం మేర రాజ్‌తోట సినిమాటోగ్ర‌ఫీ కూడా గొప్ప‌గా లేదు. గొప్ప సంభాష‌ణ‌లు లేవు. స‌న్నివేశాలు సెకండాఫ్‌లో మ‌రి బోరింగ్‌గా అనిపిస్తాయి. స‌న్నివేశాల‌కు, హీరో పాత్ర‌కు క‌నిక్టింగ్‌గా అనిపించ‌దు. ప్రేక్ష‌కుడికి ఇది బోరింగ్‌గా అనిపిస్తుంది.మొత్తంగా ప్రేక్షకుల సహనం తో..అడుకున్నారనిపిస్తుంది..

బోట‌మ్ లైన్‌: Another Boring Cinema Definitely…

రేటింగ్‌: 2.25/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *