జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చలనచిత్ర విశేషాలు

Spread the love

జూనియర్ ఎన్.టి.ఆర్ లేదా తారక్ ఈ పేరు టాలీవుడ్లో ఒక సంచలనం ,.ఎన్టీఆర్ 1983 మే 20 న హైదరాబాదులో నటుడు మరియు రాజకీయవేత్త అయిన నందమూరి హరికృష్ణ మరియు శాలిని భాస్కర్ రావులకు జన్మించాడు. అతను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరిరామరావు గారి మనవడు . తారక్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు మాత్రమే కాదు,కూచిపూడి నర్తకుడు, నేపథ్య గాయకుడు మరియు టెలివిజన్ పర్సనాలిటీ కూడా . అతని గురించిన కొన్ని ప్రాథమిక విషయాలు :

👉 విద్యాభ్యాసం : హైదరాబాద్లోని విద్యారన్య ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. హైదరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశాడు. అతను శిక్షణ పొందిన కూచిపూడి నృత్యకారుడు కూడా …

🎉వివాహం :

మేనపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద మే 5 న నార్ని.లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు.

🎉సంతానం : వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అభయ్ రామ్ మరియు భార్గవ రామ్. 👉చలన చిత్ర ప్రస్థానం : 18 ఏళ్ళ తన నటజీవితంలో, ఇరవై ఎనిమిది చిత్రాలలో నటించారు. ఒంటరిగా ఎన్నో రికార్డులను సాధించడమే కాదు ధైర్యంగా ఎన్నో అపజయాలను, అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు.

🎉అవార్డ్స్ : అతను రెండు రాష్ట్ర నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు పురస్కారాలు మరియు నాలుగు సినీ “మా” అవార్డులు కూడా అందుకున్నాడు.

🎉బాల రాముడి గా :1996 లో, తన పదమూడేళ్ళ వయసులోనే అతను రామాయణంలో బాల నటుడిగా నటించి అందర్నీ మెప్పించారు, మెప్పించడమే కాదు అందులో అచ్చుగుద్దినట్టు తన తాత పోలికలతో ఆశ్చర్యపరిచారు .ఇది ఆ సంవత్సరంలో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలన చిత్ర అవార్డును గెలుచుకుంది. తొలి చిత్రం “బాల రామాయణము” విజయాన్ని సాధించిన తరువాత దర్శకుడు గుణశేఖర్ జూనియర్ డైరెక్టర్ SS రాజమౌళి తీయబోయే మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 లో నటించడానికి సిఫార్సు చేశారు,కానీ ఆ చిత్రం చాలాకాలం పాటు నిర్మాణంలో ఉండేసరికి అతను నిర్మాత రామోజీ రావు చిత్రం లో హీరోగాసంతకం చేసాడు.

🎉హీరోగా తొలి సినిమా : 17 సంవత్సరాల వయసులో నిన్ను చూడాలని చిత్రంతో 2000 లో హీరోగా పరిచయం అయ్యాడు. .
👉2వ సినిమా స్టూడెంట్ no.1 సూపర్ హిట్ తర్వాత 🎉ఆది చిత్రం తో మాస్ హీరో అయ్యాడు. : మరో కొత్త దర్శకుడు వివి వినాయక్ తో ఆదికి సంతకం చేశాడు. మొదటిసారిగా, తన తల్లిదండ్రుల మరణానికి భూస్వామిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్న young & యాక్షన్ హీరోగా అతను నటించాడు. ఈ చిత్రం చిరంజీవి ఇంద్ర 2002 సినిమా తర్వాత అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 200 కన్నా ఎక్కువ రోజులు నడిచింది .ఈ సినిమా తో మాస్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించాడు .

⚫వరుస పరాజయాలు :ఆ తర్వాత నటించిన అల్లరి రాముడు , A. M. రత్నమ్ రాజకీయ థ్రిల్లర్ నాగా వరుస పరాజయలని చవి చూసాయి.

🎉సింహాద్రిగా మళ్ళీ సింహ గర్జన : ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి యాక్షన్ మసాలా చలనచిత్రం సింహాద్రి తో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తేలికపాటి గడ్డం వచ్చిన ఆ వయసులో..కి వచ్చిన అతనికి అభిమాన జనం “యంగ్ టైగర్ ” అనే టైటిల్ ఇచ్చింది. అతను తరువాత నటించిన పూరీ జగన్నాధ్ యొక్క అంధ్రావాలా చాలా హైప్ సృష్టించడం వాళ్ళ flop గా మిగిలిపోయింది.

👉సాంబ తో average హిట్.: అతను తన దర్శకుడు వి. వినాయక్ తో ఫ్యాక్షన్ చిత్రం, సాంబా తో average హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత నాఅల్లుడు , నరసింహూడు సినిమాలతో అతను టాలీవుడ్ లో ఉన్నత నాయకులలో తన స్థానాన్ని కోల్పోయాడు. 👉ఒక సంవత్సరం విరామం తీసుకుని నటించిన సురేందర్ రెడ్డి అశోక్ మూవీ కూడా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది.ఇది జూనియర్ కెరీర్ లో ఒక గడ్డు కాలం.

🎉రాఖీ తో తిరిగి ప్రసంశలు : కృష్ణ వంశీ యొక్క ప్రయోగాత్మక చిత్రం రాఖీ చేశారు. ఈ చిత్రం తన కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
🎉మళ్ళీ రాజమౌళీ తో హిట్ :
సోషల్ ఫాంటసీ చిత్రం యమదొంగ కోసం అతను 20 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గడం ద్వారా కొత్త మేకోవర్ లో దర్శనమిచ్చాడు తర్వాత ఈ చిత్రంఅతన్ని టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి తీసుకువచ్చింది, తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ పురస్కారం అందుకుంది. నటుడు శోభన్ బాబు కూడా తారక్ని ప్రశంసించారు. ఆ తరువాత యాక్షన్ చిత్రం కంత్రి , విజయం సాధించలేదు.

🎙 ఒక సంవత్సర విరామం. : 2009 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్రచారానికి ఒక సంవత్సరం విరామం తీసుకున్నారు.
🎉కామెడీ అదుర్స్:
యాక్షన్-కామెడీ అధూర్స్ చేశాడు, 1 సంవత్సరం విరామం తరువాత చేసిన అదుర్స్ 400 మిలియన్ల కన్నా ఎక్కువ collection ని సంపాదించింది. . ఆ తరువాత

🎉ఫ్యామిలీ- బృందావనం : రొమాంటిక్ హాస్య బృందావనం ఈ చలన చిత్రం మంచి సమీక్షలను అందుకుంది, 2010 యొక్క అత్యధిక వసూళ్లు ఒకటిగా నిలిచింది, అతని సినిమా సింహా రికార్డ్స్ను అదిగమించింది. ఈ విజయాలు కారణంగా టాలీవుడ్లో అతని స్థానం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.

ఆ తర్వాత శక్తి , ఊసరవెల్లి సినిమాలు ప్లాఫ్ ని అందుకున్నాయి. 👉కానీ ఆ తర్వాత ఫోర్బ్స్ జాబితాలో ఆయన భారత ప్రముఖుల జాబితాలో 66 వ స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత బోయపాటి శ్రీను వెంచర్ దమ్ముతో ఇది సగటు విజయాన్ని అందుకున్నాడు.
Next⚫ 2013 లో, హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన రామాయ్యా వస్తావయ్య, . ప్లాఫ్ అయినా కూడా ది టైమ్స్ ఆఫ్ ఇండియా అతడు గొప్ప నటుడు అని పేర్కొంది, ”

కెరీర్లో అత్యంత ఘోరమైన ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న సమయంలో బాద్షాహ్ మాత్రమే అతనికి విజయం సంపాధించిన ఏకైక చిత్రం.
🎉బాద్షా : శ్రీను వైట్ల చిత్రం బాద్షా చిత్రం ఒక స్లీపర్ హిట్ అయ్యింది. 50 రోజుల్లో 480 మిలియన్లు సాధించింది. టైమ్స్ అఫ్ ఇండియా, అతని నటనను గొప్పగా వర్ణించింది, మరియు తన కామిక్ టైమింగ్ను మెచ్చుకోదగిన ప్రదర్శనగా పేర్కొంది. అతని నృత్యాలు మరియు భావోద్వేగాలు ఆకట్టుకునేవిగా వర్ణించబడ్డాయి. ♦బాద్షా జపాన్లో అతనికి కీర్తి అందించినది . జపాన్లో జరిగిన ఒసాకా ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 లో బాద్షాను ప్రదర్శించారు. ఆతర్వాత వచ్చిన రభస తిరిగి ప్లాఫ్ ని ఇచ్చింది..
🎉NOn స్టాప్ హిట్స్ season :
2015 లో దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన టెంపర్ విజయాన్ని సాధించిన తరువాత తారక్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో కి గాను. 2016 లో అతను ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ చిత్రం జనవరి 13, 2016 లో విడుదలైంది మరియు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి మంచి సమీక్షలను పొందింది. టైమ్స్ ఆఫ్ ఇండియా సానుకూల సమీక్ష ఇచ్చింది, ఈ చిత్రం82. కోట్ల (US $ 12 మిలియన్) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాద్షా recordను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అతని నటన కు యమదొంగ తరువాత ఎన్టీఆర్ కు రెండవ ఫిలిం ఫేర్ అవార్డును సంపాదించింది.ఆ తర్వాత జనతా garage, జై లవకుశ, అరవింద సమేత.. సినిమాలతో..వరుస హిట్స్ తో దూసుకుపోతున్న..మన తారక్.రాబోయే R R R సినిమాతో double hattrick ని తన ఖాతా లో వేసుకోవడం ఖాయం గా కనిపిస్తుంది. Any way happy birthday to young tiger NTR..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *