★ వంద కేసు లైన ఎదుర్కొంటా
★ అనారోగ్యము తో బాధ పడుతున్నా
★ అందుకే విచారణకు గడువు కోరా
★ సివిల్ కేసు పైగా కోర్ట్ లో ఉంది
★ సెటి లర్ ను కాబట్టే వేధింపులు
★ త్వరలో నే బయటికి వస్తా
★ వీడియో రిలీజ్ చేసినా శివాజి
విజయవాడ / హైదరాబాద్ :
టీవీ9 వ్యవహారం లో తనపై నమోదు ఐన కేసు గురించి సినీ నటుడు శివాజి తొలిసారి స్పదించారు. తాను ఎక్కడికి పారిపోలేదు అని, ఎలాంటి వం ద పెట్టినా ఎక్కడికి పారిపోను అని ఎదురుక్కుంటా అని ప్రకటించారు.ఏ నేపథ్యం లో శివాజి 8 నిమిషాల వీడియో ని రిలీజ్ చేసాడు.
గత వారం ” శివాజి పారిపోయాడు అని ,దేశం వదిలి వెళ్ళేడు అని, తప్పించుకొని తిరుగుతున్నాడు ” అని జరుగుతున్నా ప్రచారం లో వాస్తవం లేదు అని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నా వారికోసం ఈ వీడియో రిలీజ్ చేయలేదు అన్నారు.
రవి ప్రకాశ్ కు , తనకు మధ్య ఉన్నా సివిల్ వివాదం అది కూడా కోర్ట్ లో ఉండగా క్రిమినల్ కేస్ గా మార్చారని ఆరోపించారు. వడదెబ్బతో ఇబ్బంది పడుతుండడo వల్ల హాజరు కాలేకపోతున్నా అని శివాజి తెలిపారు. ఇది సిల్లి కేసు అని దీనికి భయపడి విదేశాలకు పారిపోయా అని చెప్పడం సరైనది కాదు అని వెల్లడించారు.ఈ కేస్ నిలువదు అని న్యాయవా దు లకు తెలుసు అని, త్వరలో నే బయటికి వచ్చి కేస్ ఎదురుక్కుంటా అని వీడియో లో వెల్లడించారు.