నోకియాకు చెందిన పలు స్మార్ట్ఫోన్ల ధరలు భారత్‌లో భారీగా తగ్గాయి. నోకియా 8.1, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై గరిష్టంగా రూ.6 వేల వరకు తగ్గించినట్టు సంస్థ పేర్కొంది. నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఈ సేల్ కొనసాగనుంది. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలను ఇటీవలే తగ్గించిన నోకియా తాజాగా మరికొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. నోకియా 8.1 4జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.6 వేలు రాయితీని పొందేందుకు వినియోగదారులు FAN6000 అనే ప్రోమోకోడ్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇదే ఫోన్లో 6 జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.4 వేలు రాయితీ ఆఫర్ చేస్తోంది.
ఇందుకోసం కస్టమర్లు FAN4000 అనే ప్రోమోకోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. నోకియా 8.1 4జీబీ/64జీబీ స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.26,999 కాగా, 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ అసలు ధర రూ.29,999. నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్లో భాగంగా నోకియా 7.1, నోకియా6.1 ప్లస్, నోకియా 8 సిరోకోలపై వెయ్యి రూపాయిల రాయితీ ఇస్తోంది.