రెచ్చగొట్టే కార్యక్రమాలు వద్దు..అని
సంబరాలు, బాణసంచా పేలుళ్లు నిషిద్ధం అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
👉 విషయం లోకి వెళ్తే : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన అభ్యర్థులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవడం పరిపాటి. ఈ సారి అది కుదరదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని పార్టీలవారు తమ అభ్యర్థులు గెలుస్తారని ముందుగానే అంచనా వేసుకున్నారు. అలాంటి వారు బాణసంచా వంటి వాటిని పేల్చి సంబరాలు చేసుకునే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భారీగా సంబరాలు చేసుకోవచ్చా లేదా అనే అంశమై చర్చ సాగుతోంది. కోడ్ అమలు విషయంలో ఇటీవల కాలంలో ఎన్నో వివాదాలు, సందేహాలు తలెత్తాయి. సమీక్షలు, సమావేశాల సందర్భంలో చోటు చేసుకున్న వ్యవహారాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.
👉27వ తేదీ వరకు ‘కోడ్’ అమలు : ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27వ తేదీ వరకు ‘కోడ్’ అమలులో ఉంటుందని… పోలింగ్ తేదీ వరకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో, కోడ్ అమలులో ఉన్నంత కాలం అవే నిబంధనలు వర్తిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
🔴రెచ్చగొట్టే కార్యక్రమాలు నిషేధం:
కోడ్ అమలులో ఉన్నందున గెలిచిన, ఓడిన అభ్యర్థులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకూడదని అధికారులు హెచ్చరించారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమని, అంతమాత్రాన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకూడదని, కోడ్ అమలులో ఉన్నందున గెలుపొందిన వారు బాణసంచా వంటివి పేల్చి సంబరాలు చేసుకోకూడదని పేర్కొన్నారు.ఎన్నికల ఫలితాలు గురువారం రాత్రికి పూర్తి స్థాయిలో తెలుస్తాయని అధికారులు విశ్వసిస్తున్నారు. 🎉Ap లో..ఫలితాల తర్వాత వాతావరణం ఎలా ఉండబోతుందో…మరి…!!