ఎలక్షన్ ఫలితాల దెబ్బకి అన్న పానీయాలు మానేసిన ఒక అగ్ర నేత..!!

Spread the love

బీహార్ మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ అన్నపానీయాలు మానేశారు

👉విషయం లో కి వెళ్తే :
బీహార్ లోని మొత్తం 40 లోక్ స‌భ స్థానాల్లో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 4స్థానాల్లో విజ‌యం సాధించిన ఆర్జేడీ..ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు.39 స్థానాల్లో ఎన్డీయే విజ‌యం సాధించ‌గా కేవలం 1స్థానంలో మాత్ర‌మే కాంగ్రెస్ విజ‌యం సాధించింది.లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజు నుంచి దావా కుంభ‌కోణం కేసులో జైలులో శిక్ష అనుభ‌విస్తున్న బీహార్ మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ అన్నపానీయాలు మానేశారు.అంతేకాకుండా ఆయ‌న ఎవ‌రితో మాట్లాడ‌కుండా సైలెంట్ గా ఉంటున్నారు.

రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్(RIMS)లో చేరిన లాలూకు ప్రస్తుతం డాక్ట‌ర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మూడు రోజులుగా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మ‌ధ్యాహ్నా స‌మ‌యంలో భోజ‌నం చేయ‌డం లేద‌ని,ఆ కారణంగానే లాలూ అనారోగ్యం పాలయ్యారని రిమ్స్ డాక్ట‌ర్ ఉమేష్ ప్ర‌సాద్ తెలిపారు.అంతేకాకుండా లాలూ అస‌లు ఎక్కువ స‌మ‌యం సైలెంట్ గా ఉంటున్నార‌ని తెలిపారు.తాము లాలూకు సరిగా ఆహారం తీసుకోవాలని సూచించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *