వాహన తయారీ సంస్థ బజాజ్ తాజాగా, అభివృద్ధి చేసిన ‘అర్బనైట్’ స్కూటర్ టెస్ట్ డ్రైవ్ లో కెమెరా కంటికి చిక్కింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన దీనిని దేశీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కట్లోనూ విడుదల చేయాలని భావిస్తోంది.
👉అర్బనైట్’ స్పెసిఫికేషన్స్ :
‘అర్బనైట్’ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ట్విన్ స్లంటింగ్ టెయిల్ ల్యాంప్స్, వెడల్పాటి సీటు, పిలియన్ గ్రాబ్ హ్యాండిల్, ఫోల్డబుల్ రియర్ ఫుట్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కర్వీ ఫ్రంట్ ప్రొఫైల్, స్టైలిష్ అలాయ్ వీల్స్, సింగిల్ సైడెడ్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటివి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
🔴హోండా యాక్టివా 6జీకి గట్టి పోటీ :
హోండా యాక్టివా 6జీకి ‘అర్బనైట్’ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 👉ఈ స్కూటర్‌లో ఈ-సిమ్ ఎంబెడెడ్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉందని, 🔶దీని ద్వారా బ్యాటరీ, రైడ్ వివరాలు, లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు, యాప్ సాయంతోనూ స్కూటర్ కండిషన్‌ను తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.