Teluguwonders:
‘జబర్దస్త్’ చలాకీ చంటికి మరోసారి రోడ్డుaccident:
‘జబర్దస్త్’ ఆమాట వినగానే గుర్తువచ్చేది ఈటీవీ లో వచ్చే కామెడీ షో. తెలుగులో కామెడీ షోలలోబాగా ఫేమస్ అయిన కామెడీ షో ‘జబర్దస్త్’. జబర్దస్త్ లో నటించే చలాకీ చంటి కారు ప్రమాదానికి గురైంది.
విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా…
విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కారుకు ఆక్సిడెంట్ అయ్యింది . మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వద్ద చంటి కారు ప్రమాదానికి గురైంది.ముందు వెళ్తున్న లారీని చంటి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చలాకీ చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రైవేట్ హాస్పిటలో చికిత్స పొందుతున్న చంటి :
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కోదాడ policeలు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.జాతీయ రహదారిపై కారుaccident అవ్వడంవల్ల అక్కడ వాహన రాకపోకలకు ఇబ్బంది తప్పలేదు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడి నుంచి తరలించి జాతీయ రహదారిపై వాహన రాకపోకలను కోదాడ పోలీసులు పునరుద్ధరించారు. కోదాడలో ప్రథమచికిత్స చేసిన తరువాత చంటి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
చలాకీ చంటిగా బుల్లితెరపై :
చలాకీ చంటిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచయమైన చంటి జబర్దస్త్ షోతో పాటుగా ,నా షో నా ఇష్టం ప్రోగ్రాంలోనూ ఇంకా అనేక కార్యక్రమాల్లో యాంకర్ గా చేస్తున్నారు. సినిమాల్లోనూ తన నటనతో మెప్పించారు. చంటికి గతేడాది జూన్ నెలలోనూ చంటి కార్ కు ఆక్సిడెంట్ అయ్యింది .
# 2018 జూన్ 12న మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా.. చంటి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.
# (2019 జూన్ 18) సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత మళ్లి జూన్ నెలలోనే మరోసారి ఆయన ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ నెలలో సినీ రంగానికి చెందిన యువ హీరోలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నెల కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ఆక్సిడెంట్లో మెగాహీరో వరుణ్‌తేజ్ కు కారు ఆక్సిడెంట్ అయ్యింది. ఆ ఆక్సిడెంట్లో గాయాలేమీ కాకుండా వరుణ్‌తేజ్ తప్పించుకున్నారు. ఆ తర్వాత షూటింగ్ సందర్భంగా ఆక్సిడెంట్స్ కి గురైన నాగశౌర్య , సందీప్ కిషన్ , శర్వానంద్ గాయపడి చికిత్స పొందుతున్నారు.