అభినందన్.. శత్రుచెరలోనూ తగ్గని మనోనిబ్బరం!
హైలైట్స్
- మనోనిబ్బరం చూపిన శత్రుచెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్
- పాక్ అధికారులు ప్రశ్నించినా ఒక్క రహస్యం కూడా వెల్లడించని పైలట్.
- పాక్ అధికారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరణ.
బుధవారం ఉదయం పాకిస్థాన్ చేతికి చిక్కిన భారత్ వైమానిక దళ పైలట్ అభినందన్‌కు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో టీ తాగుతున్న అభినందన్, విచారణ చేస్తున్న అధికారులకు సమాధానమిస్తున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది. తమకు చిక్కిన వింగ్ కమాండర్‌పై పాకిస్థాన్ పౌరులు విచక్షణారహితంగా దాడిచేసి కొడుతున్నట్లు ఉన్న వీడియో తొలుత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అభినందన్, కేవలం ఆయన ఐడీ నెంబరు, పేరును మాత్రమే బయట పెట్టినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. అతడి ముఖమంతా రక్తమోడుతూ ఉండగా, ఈ వీడియోపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జెనీవా ఒప్పందం ప్రకారం పొరుగుదేశానికి చిక్కిన వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని భారత్ పేర్కొంది.
2019 మార్చి 1 న పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను భారత అధికారులకు అప్పగించారు. వాఘా వద్ద సరిహద్దును దాటి అతడు భారత్‌లోకి ప్రవేశించాడు
అభినందన్ వర్థమాన్