పోప్ ఫ్రాన్సిస్ తర్వాత అక్కడ మోడీకే అంత క్రేజ్

Spread the love

Teluguwonders:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పాల్గొనే ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.

💥హౌడీ, మోదీ కార్యక్రమం:

ఆసలేంటి హౌడీ, మోదీ – నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు.

హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 22 ఆదివారం ఎన్ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు.

🔴 రుసుము లేకుండానే నమోదు :

ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేకుండానే పేర్లు నమోదు చేయించుకోవచ్చునని చెప్పారు. ఇకపై పేర్లు నమోదు చేయించుకునేవారిని వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచుతామని చెప్పారు. ఈ నెల 29 వరకు విశ్వవిద్యాలయ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునన్నారు

🔴 సెప్టెంబర్ 27 న :

వచ్చే నెల 27న ప్రధాని మోదీ అమెరికాలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు హాజరవుతారు. అంతకుముందు ఆయన హూస్టన్‌లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారు. హూస్టన్‌లో 1,30,000 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారు.

దీనిని భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉత్తర అమెరికాలో ఓ భారత దేశ ప్రధాన మంత్రి పాల్గొనే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకాబోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు.

💥ఇది విశేషం :

పోప్ ఫ్రాన్సిస్ మినహా విదేశీ నేతలు పాల్గొనే సభకు గతంలో ఈ స్థాయిలో ప్రజలు హాజరు కాలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *