దారి తప్పకుండా కాపాడిన అన్నయ్య :పవన్ కళ్యాణ్

Spread the love

చిరంజీవి 64వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సమక్షంలో చిరంజీవి బర్త్ డే కేక్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్ చేసారు. ఈ సందర్భంగా అన్నయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో తాను ఫెయిల్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంటర్‌లో తాను ఫెయిల్ కావడంతో చనిపోవాలనుకున్నాను. అపుడు అన్నయ్య చిరంజీవి తనను ఓదార్చుతూ .. తాను బతకాలని, తన దారి వేరే ఉందని అప్పట్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసారు. నిరాశగా ఉన్న తనను చూసి.. నీ బతుకు ఇంటర్‌తోనే ఆగిపోలేదని వేరే ఎక్కడో ఉందని అన్నయ్య చెప్పిన విషయాలను పవన్..అన్నయ్య చిరు జన్మదిన వేడుకల్లో గుర్తు చేసుకున్నారు.
ఇక అన్నయ్య పుట్టినరోజు తనకేంతో ప్రత్యేకమన్నారు. ఇక ఒక అభిమానిగా చిరంజీవిని ఎలాంటి సినిమాలో చూడాలనకుంటున్నానో అలాంటి సినిమానే ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రమనన్నారు. ఈ సినిమా స్టోరీ అన్నయ్య తెచ్చుకున్నది కాదు. ఆయనను వెతుక్కుంటూ వచ్చిన స్టోరీ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు చరిత్ర మరిచిపోయిన వీరుడి కథను తెరకెక్కించడం గర్వంగా ఉందన్నారు. అంతేకాదు తాను జీవితంలో దారి తప్పకుండా కాపాడిన అన్నయ్యకు తాను జీవితాంతం ఎపుడు రుణపడి ఉంటానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *