స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. దిగ్గజ టీవీ కంపెనీలు వాటి ప్రొడక్టుల ధరను తగ్గించేశాయి. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ టీవీల ధరలు దిగొచ్చాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.
కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. టీవీల ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ పండుగ సీజన్‌లో టాప్ టీవీ బ్రాండ్లు వాటి టీవీల ధరలను 30 శాతం వరకు తగ్గించాయి. కన్సూమర్ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి కంపెనీలు ఈ చర్య తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పడిపోతున్న వృద్ధిని పరుగులు పెట్టించడానికి పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
శాంసంగ్, ఎల్‌జీ, సోనీ వంటి దేశీ టాప్ టీవీ బ్రాండ్లు వాటా పెద్ద స్క్రీన్, ప్రీమియం మోడల్ టీవీల ధరలను ఏకంగా దాదాపు రూ.40,000 వరకు తగ్గించాయి. 32, 43 అంగుళాల టీవీలు విషయానికి వస్తే షావోమి, టీసీఎల, ఐఫాల్కన్, వీయూ, కొడక్, థామ్సన్ వంటి కంపెనీలు కూడా ధరలను కనిష్ట స్థాయికి తగ్గించేశాయి.
ధరల తగ్గింపుతో 32 అంగుళాల టీవీ రూ.7,000కే అందుబాటులోకి వచ్చింది. 43 అంగుళాల స్మార్ట్ 4కే మోడల్ రూ.21,000కు లభ్యమౌతోంది. ప్రీమియం విభాగానికి వస్తే 55 అంగుళాల స్మార్ట్ 4కే అల్ట్రా హెచ్‌డీ సోనీ టీవీ ఇప్పుడు రూ.1.1 లక్షలకు అందుబాటులో ఉంది. దీని ధర ఆగస్ట్ నెలలో రూ.1.3 లక్షలు కావడం గమనార్హం. బ్యాంకుకు వెళ్లకుండానే నిమిషాల్లో రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు రుణం!ఎల్‌జీ కంపెనీ తన 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ మోడల్ ధరను రూ.1.34 లక్షల నుంచి రూ.1.2 లక్షలకు తగ్గించేసింది. ‘ఈ పండుగ సీజన్‌లో టీవీ బ్రాండ్లు భారీ తగ్గింపు ప్రకటించాయి’ అని ప్రముఖ ఎలక్ట్రానిక్ రిటైల్ చైన్ గ్రేట్ ఈస్ట్రన్ డైరెక్టర్ పుల్కిత్ బైద్ తెలిపారు. 32, 43 అంగుళాల టీవీల ధరలు తగ్గాయని పేర్కొన్నారు. గత దీపావళి నుంచి టీవీల అమ్మకాలు అలాగే ఉండటం దీనికి కారణమని తెలిపారు.