వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. పాపులర్ మెసేజింగ్ యాప్ ఇది. ఇప్పుడు బ్యాంకులు కూడా వాట్సాప్‌ను తెగ వాడేసేందుకు సిద్ధమౌతున్నాయి. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.
హైలైట్స్:
- వాట్సాప్ బాట పడుతున్న బ్యాంకులు
- ఇప్పటికే వాట్సాప్ సేవలు అందిస్తున్న చాలా బ్యాంకులు
- మిని స్టేట్మెంట్ నుంచి ప్రిఅప్రూవ్డ్ రుణాల వరకు పలు సర్వీసులు
- దేశంలోని దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బాట పట్టాయి. కస్టమర్లకు రియల్‌టైమ్ సర్వీసులు అందించేందుకు వాట్సాప్‌లోనే బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. కస్టమర్లు వాట్సాప్ ద్వారానే బేసిన్ బ్యాంకిగ్ సర్వీసులు పొందొచ్చు.
ఎలాంటి సేవలు పొందొచ్చు?
బ్యాంక్ కస్టమర్లు మిని స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్లెస్ట్, డెబిట్ కార్డ్ ఎలిజిబిలిటీ, ప్రిఅప్రూవ్డ్ లోన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల సమాచారం వంటి వివరాలను వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు.