ఇంటికి మహేషే భారం.. ఈవారం వెళ్లిపోయేది ఇతనేనా?

Spread the love

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆసక్తికరంగా సాగుతోంది. షో ముగియడానికి ఇంకా నాలుగు వారాల సమయం ఉండటంతో విజేతగా ఎవరు నిలుస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువవుతోంది. దీనికి తోడు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇస్తోన్న వెరైటీ టాస్కులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ‘బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్’ పేరుతో కంటెస్టెంట్లను ఆడించిన బిగ్ బాస్..

చెప్పుతో కొట్టాలో అర్థంకావడంలేదు..

ఈ మాట అన్నది ఎవరో కాదు పునర్నవి. అన్నది రాహుల్‌ని అనుకునేరు.. మహేష్ విట్టాను. నవరాత్రులు కదా నేను గుడ్డు కూడా తినను అని మహేష్ చెప్పాడట. కానీ, అతను ఆమ్లెట్ వేసుకుని తినేశాడు. పునర్నవి అడిగితే తెలియక తినేశాను అని సమాధానం చెప్పాడు. ఈ విషయాన్ని పునర్నవి.. వరుణ్, వితిక దగ్గర డిస్కస్ చేసింది. ‘‘వాడు ఆమ్లెట్ తిని ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు నవరాత్రులు నేను తిన్ను అంటున్నాడు.

రాహుల్, పునర్నవి మధ్య మొన్న, నిన్న చిన్న డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్‌పై  పునర్నవి కోపం పడటం.. మళ్లీ పునర్నవిపై రాహుల్ అలగడం చూశాం. ఇది శనివారం నాటి ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. పునర్నవి మాట్లాడదామని వెళితే రాహుల్ తన ముందు నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తరవాత మళ్లీ పునర్నవి గురించి వరుణ్ దగ్గర రాహుల్ డిస్కస్ చేశాడు.

ఇంటికి ఎవరు భారం:
శుక్రవారం ఇంటిలో జరిగిన విషయాలను చూపించిన నాగార్జున ఆ తరవాత మన టీవీ ద్వారా కంటెస్టెంట్లను పలకరించారు. వాళ్లకు ఒక ‘భార’మైన టాస్క్ ఇచ్చారు. కెప్టెన్ శ్రీముఖిని స్టోర్ రూంలో ఉన్న బరువైన బ్యాగ్‌ను తీసుకురమ్మని నాగార్జున చెప్పారు. ఆ తరవాత ఒక్కొక్కరిని లేపి బిగ్ బాస్ హౌస్‌కి ఎవరు భారం అని అనుకుంటున్నారని అడిగారు.

మాకు పాత అలీ కావాలి..
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టిన అలీ తన పంథా మార్చుకున్నాడని, గతంలో మాదిరిగా ఆడటం లేదని నాగార్జున అన్నారు. ఇదే విషయాన్ని అలీని ప్రశ్నించారు. శివజ్యోతి ట్యాంక్‌లో నీళ్లు పోయడాన్ని నాగార్జున తప్పు బట్టారు. శివజ్యోతిని తన ఆట తనని ఆడనివ్వమని చెప్పారు. ఆడియన్స్ మళ్లీ ఆ పాత అలీని కోరుకుంటున్నారని నాగార్జున అన్నారు.
రాహుల్ సేఫ్..
ఈవారం ఎలిమినేషన్‌ నామినేట్ అయినవారిలో రాహుల్, మహేష్, పునర్నవి, వరుణ్ సందేశ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో రాహుల్ సేఫ్ అయినట్టు ఎపిసోడ్ చివరిలో నాగార్జున ప్రకటించారు. అది కూడా వితిక మెడల్ గెలిచినందుకు హౌస్‌లో కేక్ పార్టీ పెట్టారు. మొత్తం నాలుగు పేస్ట్రీలు ఇచ్చి వాటిలో ఒకటి వితికదని, మిగిలిన మూడు హౌస్‌మేట్స్ పంచుకోవాలని చెప్పారు. వితిక తన కేక్‌ను హౌస్‌మేట్స్ అందరికీ పెట్టింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *