‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సెట్స్ నుంచి ఓ కొత్త ఫొటో……

Spread the love

టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రాధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. తాజాగా సినిమా సెట్స్‌ నుంచి ఓ కొత్త ఫొటో బయటికి వచ్చింది. ఫొటోలో రాజమౌళి, తారక్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటిస్తున్నారు.
చరణ్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారు. తారక్‌కు జోడీగా ఎవరు నటించనున్నారు అన్న విషయంపై ఇన్ని రోజులు అవుతున్నా సినిమా టీం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న రాజమౌళి బర్త్‌డే. కనీసం ఆ రోజన్నా సినిమాకు సంబంధించిన టీజరో, పోస్టరో విడుదల చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆరాటంగా ఎదురుచూశారు. కానీ రాజమౌళి తనకు పుట్టినరోజు విషెస్ చెప్పినవారికి థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే కానీ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వలేదు. దాంతో ఫ్యాన్స్‌కు ఈ విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది. స్పెషల్ డేస్‌లోనూ రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం రివీల్ చేయడంలేదంటే.. దీనికి వెనక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఇన్నిరోజులు ఎదురుచూసిన దానికి తగిన ప్రతిఫలమే వస్తుందని తారక్, చరణ్ అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.

మరోపక్క ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి టైటిల్‌కు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ఈ టైటిల్‌కి అర్థం ‘రామ రౌద్ర రుషితం’ అని అర్థమట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య సినిమాను రూ.400 కోట్లు పెట్టి తీస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో తారక్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ‘సైరా’ నిర్మాణ పనులతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్ నిమిత్తం లండన్ వెళ్లారు. ఆయన తిరిగి వచ్చాక ‘ఆర్ ఆర్ ఆర్’ షూట్‌లో పాల్గొంటారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *