ఎప్పటిలానే విజయ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారు. ముఖ్యంగా రాయప్పన్ క్యారెక్టర్ గూస్ బంప్స్. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఫైట్ ఫ్యాన్స్‌కు కనులపండువే.
ఇదిలా ఉంటే, ‘బిజిల్’ సినిమా ప్రీమియర్ షోలు విదేశాల్లో ఇప్పటికే ప్రారంభమైపోయాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే, ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొంత మంది సినిమా సూపర్ డూపర్ హిట్ అంటుంటే, కొంత మంది మాత్రం అస్సలు బాగాలేదని, పూర్తిగా నిరూత్సాహపరిచిందని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, సినిమా గురించి పూర్తి నెగిటివ్‌గా ట్వీట్లు చేసేది అజిత్ ఫ్యాన్స్ అనే ఆరోపణ కూడా వస్తోంది.
పాజిటివ్ టాక్ బట్టి చూస్తే.. ఫస్టాఫ్ అదిరిపోయిందట. రాయప్పన్ క్యారెక్టర్‌ను అట్లీ అద్భుతంగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ అయితే విజయ్ అభిమానులకు కన్నులపండువేనని టాక్. విజయ్ కెరీర్‌లో రాయప్పన్ పాత్ర ది బెస్ట్ అని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. నయనతార చాలా క్యూట్‌గా ఉందని అంటున్నారు. ఇక మైఖేల్ పాత్రలో విజయ్ ఎప్పటిలానే చాలా హుషారుగా తన మ్యానరిజంతో అలరించారట. ‘వెర్రెక్కిద్దాం’ సాంగ్ అయితే థియేటర్‌లో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయం అంటున్నారు. రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో బలమట.