ఈ దీపావళిని ఈ అందమైన విషేస్‌తో మరింత ఆనందమయం చేసుకోండి. మీ కుటుంబికులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.
మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే.. దీపావళి వస్తుందంటే చాలు, దేశమంతా సందడి నెలకొంటుంది. మరి, ఈ పండుగ సంతోషాన్ని మీ కుటుంబికులతోనే కాకుండా సుదూర ప్రాంతంలోని ఆప్తులు, మిత్రులతోనూ పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఈ కింది విషెస్‌ను మీ ఆప్తులతో షేర్ చేసుకోండి.
దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..
ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదల రవళి
కోటి వెలుగుల రవళి
కావాలి మీ ఇంట దీపావళి
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ ఇంట..
కురిపించాలి సిరులు పంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట..
అందుకోండి మా శుభాకాంక్షల మూట..
మీ ఇంట చిరుదివ్వెల కాంతులు..
జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై వెలుగు విజయమే ఈ దీపావళి..
దుష్ట శక్తులను పారద్రోలి,
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే..
వెలుగుల పండుగే దీపావళి.
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు