బిగ్ బాస్ ఫైనల్‌ ఓటింగ్.. ఒక్క క్లిక్‌తో ఓటు

0

బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్, ఎలిమినేషన్స్ ప్రక్రియలు ముగిశాయి. ఆట అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్‌గా టాప్ 5 కంటెస్టెంట్స్‌గా శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు నిలిచారు. మరి వీరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఓటు వేసి విన్నర్‌ని చేయడం ఎలాగో తెలుసుకుందాం.

  • బిగ్ బాస్ సీజన్ 3లో ముగిసిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలు
  • టాప్ 5లో వరుణ్, శ్రీముఖి, బాబా, అలీ, రాహుల్
  • రెండు ప్రక్రియల్లో ఓటింగ్
  • హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కు ఓటు వేయొచ్చు
బిగ్ బాస్ సీజన్ 3‌లో అసలు మజా మొదలైంది. ఎలిమినేషన్ ప్రక్రియ షురూ కాగా.. తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే, మూడో వారం తమన్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి, ఐదోవారం అషు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక ఆరోవారం ఎలిమినేషన్ ఎత్తివేగగా.. ఏడోవారంలో అలీ రాజా, ఎనిమిదో వారంలో శిల్పా చక్రవర్తి, తొమ్మదో వారంలో హిమజ, పదో వారంలో రవి, 11వ వారంలో పునర్నవి, 12 వారంలో మహేష్ విట్టా, 13 వారంలో వితికా, 14 వారంలో శివజ్యోతి ఇలా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ, రాహుల్‌లు బిగ్ బాస్ సీజన్ 3లో ఫైనల్ వార్‌తో తలపడేందుకు టాప్ 5 కంటెస్టెంట్స్‌గా నిలిచారు.
ఇక 14 వారానికి సంబంధించిన నామినేషన్స్ రంజుగా సాగాయి. ఇందులో గెలిచిన వాల్లకు టికెట్ టు ఫినాలే ఉండటంతో డైరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్లే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో రాహుల్ అందరికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో అతనికి టికెట్‌ టు ఫినాలే లభించింది. దీంతో రాహుల్ ఒక్కడే ఈవారం నామినేషన్స్ నుండి మినహాయింపు లభించగా.. మిగిలిన వరుణ్, అలీ, బాబా, శ్రీముఖి, శివజ్యోతిలు నామినేషన్‌లో నిలిచారు. ఈ ఐదుగురిలో మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఓటు వేయడం ఎలా అనే తదితర విషయాలు తెలుసుకుందాం.
గతంలో ‘గూగుల్‌ ఓటింగ్‌ సిస్టమ్‌’ ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వచ్చిన ఓట్ల ద్వారా ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టేవారు. అయితే, ఈసారి ఎలిమినేషన్‌‌కి చేపట్టే ఓటింగ్‌ ప్రక్రియను మార్చేశారు. ఇందులో ఒకటి హాట్ స్టార్ ద్వారా ఓటింట్ చేయడం.. రెండోది మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేయడం.
బిగ్ బాస్ 3 విజేత ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారు?

మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేసే విధానం..
డైరెక్ట్‌గా ఫోన్ చేసి మిస్డ్ కాల్ ద్వారా ఓట్ వేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో నంబర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఒక ఓటు వేయొచ్చు. రోజులో ఒక్కోనెంబర్ నుండి పది వరకూ ఓట్లు వేయొచ్చు. ఈ ఓట్లను సర్దుబాటు చేసుకునే వీలుంది. అంటే ఉదాహరణకు ఎలిమినేషన్‌లో ఐదుగురు ఉంటే ఐదుగురికి తలొక రెండు చొప్పున లేదా.. పది ఓట్లను ఒక్కరికే వేసుకునే వీలుంది. ఎవరికి ఎన్ని ఓట్లు వేయాలన్నది ఓటర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

Leave a Reply