దిశ హత్య : చనిపోయిన తరువాత కాదు బ్రతికుండగానే …?

Spread the love

 

దిశ హత్య : చనిపోయిన తరువాత కాదు బ్రతికుండగానే …?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం లో రోజుకో వార్త వెలుగులోకి వస్తుంది. తాజాగా ఇప్పుడు మరో చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ముందుగా  దిశను  అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసి తరువాత కాల్చి వేశారని పోలీసులు భావించారు. కానీ దిశాని బ్రతి ఉండగానే సజీవ దహనం చేశారన్న వాస్తవం వెల్లడైంది. నలుగురు నిందితుల్లో ఒకడు జైల్లో కాపలాగా ఉన్న జవాను వద్ద ఈ వాస్తవాన్ని చెప్పినట్టు విశ్వసనీయమైన సమాచారం. కొందరు జవాన్లు వారితో మాట కలపగా ప్రధాన నిందితుడు ఆరిఫ్ ఏ మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గపు నిర్వాకాన్ని మొత్తం పూస గుచ్చినట్టు చెప్పాడట.

దిశ ను బలవంతంగా కాళ్లు చేతులు పట్టుకుని లాక్కెళ్లామని ఆమె పెద్దగా కేకలు వేస్తుంటే ఎవరైనా వింటారన్న భయంతో తమ వద్ద ఉన్న మద్యాన్ని బలవంతంగా నోట్లో పోశామని అప్పటికే తీవ్ర భయంతో ఉన్న ఆమె స్పృహ తప్పగా అత్యాచారం చేశామని ఆరిఫ్ చెప్పినట్టు జైలు సిబ్బందిలో ఒకరు తెలిపారు. మద్యం తాగించడంతో పాటు అత్యంత క్రూరంగా ప్రవర్తించడం తో ఆమె అపస్మారక  స్థితిలోకి  వెళ్లిందని ఆపై ఏమి చేయాలో తెలియక పెట్రోల్ పోసి తగలబెడితే మేము తప్పించుకోవచ్చు అని అనుకోని తగులబెట్టామని చెప్పాడట.

కాగా ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులూ ప్రస్తుతం చర్లపల్లి  జైల్లో ఉండగా వారిని కస్టడీ కి ఇచ్చే విషయంలో నేటి ఉదయం 11 గంటల తరువాత షాద్ నగర్ కోర్టు ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి కే  షాద్ నగర్ కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నిందితులను కోర్టు కు తీసుకు వస్తే ప్రజలు ఆందోళనకు దిగే అవకాశాలు ఉండటం తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని పోలీసులు ఇప్పటికే నిర్ణయించారు. ఇక మరో వైపు మాత్రం దిశ నిందుతులకి ఉరి శిక్ష వేయాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇక ఈ కేసు కోసం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *