తెలంగాణలో అమెజాన్ రూ.11 కోట్ల పెట్టుబడులు – 2 డేటా సెంటర్లు ఏర్పాటు

Spread the love

అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.11624 కోట్లతో (1.6 బిలియన్ డాలర్లు) రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ రెండు డేటా సెంటర్లను కూడా హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల శివార్లలో నిర్మించనుంది. పెట్టుబడిలో 90 శాతానికి పైగా ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్ – స్టోరేజ్ పరికరాలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ రెండు సెంటర్లు కూడా తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి పని చేస్తాయి.

ఇందులో ఒక డేటా సెంటర్ ను చందన్ వెల్లి గ్రామంలో – మరో డేటా సెంటర్ ను కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైంది. ఈ ప్రాంతం ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు పరిధిలో ఉంది. డేటా సెంటర్ ప్రతిపాదలను ప్రభుత్వం ముందు ఉంచిన అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (ADSIPL).. పర్యావరణ అనుమతులను కోరింది.

జనవరి 31వ తేదీన నిపుణుల కమిటీకి అవసరమైన పత్రాలను అందించింది. ఈ పత్రాల ప్రకారం చందన్ వెల్లిలో 66003 చదరపు మీటర్లు – మీర్ ఖాన్ పేటలో 82833 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది.

ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ నోటిఫికేషన్ – 2006 ప్రకారం 20 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంతో చేపట్టే నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవసరం. ఐటీ డిపార్టుమెంట్ ప్రకారం ఈ రెండు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోను డేటా సెంటర్ అభివృద్ధికి భూమిని కేటాయించేందుకు సానుకూలంగా ఉంది.

టెక్ దిగ్గజం అమెజాన్ 2024 నాటికి ఇండియాలో డిజిటల్ మార్కెట్ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. క్లౌడ్ కంప్యూటింగ్ – బిగ్ డేటా – ఐవోటీ సేవలకు డిమాండ్ పెరిగింది. అదే విధంగా దేశంలో ఇంటర్నెట్ – స్మార్ట్ డివైస్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *