మద్యం మానాలంటే.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు..!!మద్యం మానాలంటే.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు..!!

Spread the love

మద్యం మానాలంటే.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు..!!

ఇటీవల కాలంలో చాలా మంది మద్యానికి అలవాటు పడుతున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నారే గానీ చిన్న మొత్తంలో తాగితే హాయికరం అని పరిశోధనల్లో రుజువు కాలేదు. ఇటీవల తేలిందేంటంటే మద్యం పెద్దగా తాగినా.. కొద్దికొద్దిగా తాగినా.. ఎలా తాగినా ఆరోగ్యం అటకెక్కినట్లే. మన దగ్గరైతే ఏ కార్యం చేసిన కానీ మందు అనేది తప్పని సరి కదా. ఇదిలా ఉంటే మరోవైపు మద్యసేవించడం ఆరోగ్యానికి హానికరం అని చాలా యాడ్స్ వస్తున్నే ఉంటాయి. అయినా కానీ మద్యం సేవించడం మాత్రం మానివేయారు. మద్యం తాగితే మన బాడీ బయట పెద్దగా మార్పులేవీ కనిపించవు కానీ… బాడీ లోపల ఉండే పార్టులకు తీవ్రమైన హాని తప్పదు.

గుండె, ఊపిరి తిత్తులు, కాలేయం, పేగులు ఇలా కీలకమైన అవయవాలన్నీ దెబ్బతినేస్తాయి.

తాగుడు వల్ల మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. దాంతో ఒత్తిడి పెరుగుతుంది విటమిన్లు, ముఖ్యంగా ‘బి’ విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడుపెై పొరలపై చూపే చెడు ప్రభావం వల్ల ఇలా అవుతుంది. మద్యం తాగుతూ పైకి హీరోలా ఉండే చాలా మందికి లోపల అడ్డమైన రోగాలూ ఉన్నట్లే లెక్క. ఏదో ఒక రోజు తేడా వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్తేగానీ అసలు విషయం తెలియదు. అయితే దీన్ని మానాలంటే ఓ చిన్న ట్రిక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మద్యం అలవాటు ఉన్న వారికి రెండు స్పూన్ల మెంతులు సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టి ఉడికించి తేనెతో కలిపి తినిపించాలి.

దీని వలన దెబ్బతిన్న కాలేయం బాగుపడుతుంది. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే మెంతుల్లోని చేదు, జిగురు తత్వాలు మద్యం అంటే ఒక విధమైన అసహ్యం కలిగేలా చేస్తాయి. ఎంతటి మద్యపాన ప్రియులైనా మెంతులు తిన్నాక దాని జోలికే వెళ్లడానికి ఇష్టపడరు. అదేవిధంగా, మద్యం తాగాలని ఆలోచన వచ్చినప్పుడు మెంతుల డికాక్షన్‌ని తాగితే.. మద్యం మీద అసహ్యం పుడుతుంది. మరియు మెంతులు, మెంతి ఆకులను నీటిలో మరగబెట్టి తాగినా కూడా మద్యం అలవాటు మాన్పించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *